twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కర్ణాటకలో బ్యాన్: ‘బాహుబలి2’పైనే ఎందుకంటే?, కారణాలు చూస్తే షాక్!

    టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బాహుబలి-2 కోసం దేశమంతా వేచిచూస్తుంటే.. కర్ణాటక సినీ అభిమానుల్లో మాత్రం ఆ సినిమా చూసే అవకాశం లేకుండా పోతోందనే ఆందోళన నెలకొనివుంది.

    |

    బెంగళూరు: టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బాహుబలి-2 కోసం దేశమంతా వేచిచూస్తుంటే.. కర్ణాటక సినీ అభిమానుల్లో మాత్రం ఆ సినిమా చూసే అవకాశం లేకుండా పోతోందనే ఆందోళన నెలకొనివుంది. పలు ప్రో కన్నడ సంస్థలు ఈ చిత్రంపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధించడమే ఇందుకు కారణం.

    కాగా, కన్నడ ఆత్మాభిమానం పేరుతో ప్రో కన్నడ, రాజకీయ నేత వటల్ నాగరాజు.. కర్ణాటకలో బాహుబలి విడుదలవుతున్న రోజున రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కన్నడ సినీ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వ్యక్తిగత ప్రచారం కోసం అవకాశవాద జిమ్మిక్కులు చేస్తున్నారంటూ నాగరాజుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన బాహుబలి చిత్రాన్ని అడ్డుకుంటే బాగా పేరొస్తుందని అతడు భావిస్తున్నట్లు మండిపడుతున్నారు.

    ఈ క్రమంలో అడిగిన పలు ప్రశ్నలకు నాగరాజు సమాధానాలు:

    బాహుబలి 2ను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది మీ పబ్లిసిటీ జిమ్మిక్కేనా?

    బాహుబలి 2ను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది మీ పబ్లిసిటీ జిమ్మిక్కేనా?

    జవాబు: మేము ఈ చిత్రానికి వ్యతిరేకం కాదు. ఈ చిత్రాన్ని అడ్డుకుని వ్యక్తిగత ప్రయోజనం పొందాలనుకోవడం లేదు. ఈ చిత్రంలో నటించిన సత్యరాజ్‌కు మాత్రమే తాము వ్యతిరేకం. కావేరి, కన్నడ, కర్ణాటక, కన్నడిగులకు భే షరతుగా సత్యరాజ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అతడు క్షమాపణలు కోరే వరకూ ఈ చిత్ర విడుదలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతాం. గతంలో రజినీకాంత్ చేసిన విధంగా బేషరతుగా క్షమాపణలు చెబితే ఈ చిత్రాన్ని అడ్డుకోబోం.

    బాహుబలి 2నే ఎందుకు టార్గెట్ చేశారు? సత్యరాజ్ నటించిన ఇతర సినిమాలు విడుదలవుతున్నాయి కదా?

    బాహుబలి 2నే ఎందుకు టార్గెట్ చేశారు? సత్యరాజ్ నటించిన ఇతర సినిమాలు విడుదలవుతున్నాయి కదా?

    జవాబు: మేం ఎప్పుడూ సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకం. సత్యరాజ్ నటించిన కొన్ని సినిమాలు ఇక్కడ విడుదలైన విషయం నిజమే, కానీ, అన్ని కన్నడ సంఘాలు ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు సిద్ధమయ్యాయి. 2వేలకు పైగా కన్నడ సంఘాలు ఈ చిత్ర విడుదలను వ్యతిరేకిస్తున్నాయి.

    ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నారు?

    ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నారు?

    జవాబు: ఇదే సరైన సమయం. ఇప్పటి వరకు వచ్చినవి సత్యరాజ్ నటించిన చిన్న చిత్రాలు. చాలా సంఘాలు అతడు నటించిన బాహుబలి2 చిత్రాన్ని అడ్డుకోవడం ద్వారా అతనికి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాయి. మేం అతని నుంచి బే షరతు క్షమాపణలు మాత్రమే కోరుతున్నాం.

    బాహుబలి2 మెగా ఫిల్మ్ కావడం వల్లే అవకాశవాద నిరసన చేస్తున్నారా?

    బాహుబలి2 మెగా ఫిల్మ్ కావడం వల్లే అవకాశవాద నిరసన చేస్తున్నారా?

    జవాబు: కాదు. తామేమీ అవకాశంగా తీసుకోవడం లేదు. కానీ, అన్ని కన్నడ సంఘాలు ఏకమై ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు సిద్ధపడ్డాయి. తమ ఆగ్రహాన్ని తెలియజేసేందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం. అయితే, సత్యరాజ్‌ క్షమాపణలు చెబితే సరిపోతుంది. కానీ ఆయన అలా చేయడం లేదెందుకు?

    సత్యరాజ్ పై అంత కోపం ఎందుకు? అతను చేసిన వ్యాఖ్యలతో మీకేం సమస్య వచ్చింది?

    సత్యరాజ్ పై అంత కోపం ఎందుకు? అతను చేసిన వ్యాఖ్యలతో మీకేం సమస్య వచ్చింది?

    జవాబు: తాము తమ తల్లిలాగా భావించే కావేరి నదిని తన భార్యతో పోల్చాడు సత్యరాజ్. అది మమ్మల్ని అవమానించినట్లే. కన్నడిగులను, కర్ణాటకను ఆయన విమర్శించారు. ప్రజలందరి ముందు తమ పేరును ప్రస్తావించారు సత్యరాజ్. రజినీకాంత్, కమల్ హాసన్‌లు వేదికపై ఉండగానే సత్యరాజ్.. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు.
    నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. ఇతర కన్నడిగులను కూడా విమర్శించారు. దీన్ని ప్రశ్నించకూడదా?

    ఏడాది క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాద్దాంతం ఎందుకు? ఇది అనవసరం అనిపించడం లేదా?

    ఏడాది క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాద్దాంతం ఎందుకు? ఇది అనవసరం అనిపించడం లేదా?

    జవాబు: ఇది రాద్దాంతం కాదు. నేరం చేసి చాలా కాలం గడిచిపోయిందని నిందితుడ్ని వదిలేస్తామా? చట్టం అతడ్ని శిక్షిస్తుంది కాదా! ఈ భూమిని, కన్నడిగులను అవమానపర్చిన ఆ వ్యక్తి సినిమాను ఇక్కడి ప్రజలు ఎలా చూస్తారు?. ఓ మూర్ఖుడిలా సత్యరాజ్ ఆ వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పాలని మాత్రమే తాము కోరుతున్నాం. ఇదేం పెద్ద విషయం కాదు. కర్ణాటక, కావేరి, కన్నడిగులను అవమానించిన అతను క్షమాపణలు చెప్పొచ్చు కదా! రజినీకాంత్ లాంటి వ్యక్తే క్షమాపణలు చెప్పారు. సత్యరాజ్ ఆ పని చేయలేరా?

    ప్రభుత్వ మద్దతుతో బాహుబలి2 విడుదలైతే ఏం చేస్తారు?

    ప్రభుత్వ మద్దతుతో బాహుబలి2 విడుదలైతే ఏం చేస్తారు?

    జవాబు: ఆర్మీ వచ్చినా మా నిరసన ఆగదు. తాము వెనుకడుగు వేసేది లేదు. బాహుబలి2 విడుదలైతే తాము రాష్ట్ర వ్యాప్తంగా కన్నడ సంఘాలతో కలిసి నిరసన ప్రదర్శనలు చేపడతాం. రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తాం. సినిమా హాళ్లలోనే కాదు.. బాత్రూంలలో కూడా సినిమాను నడవనీయం. మరోసారి చెబుతున్నా.. మేము బాహుబలి2 చిత్రానికి వ్యతిరేకం కాదు. మా కోపమంతా సత్యరాజ్ పైనేనని వటల్ నాగరాజు స్పష్టం చేశారు.

    English summary
    While the nation gears up to drown in the world of Baahubali, people in Karnataka may not get it to watch it, thanks to a statewide bandh call given by pro-Kannada organisations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X