twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 'పరువు' తీయనీకే.. తలెత్తుకోకుండా చేశాడు: 'అజ్ఞాతవాసి'పై ఓ అభిమాని ఆవేదన..

    |

    Recommended Video

    'అజ్ఞాతవాసి'పై ఓ అభిమాని ఆవేదన చుడండి !

    ఉత్సాహం నీరుగారిపోయింది. ఎంత అభిమానం అడ్డొస్తున్నా సరే.. 'అజ్ఞాతవాసి'పై అభిమానులు సైతం బాహాటంగానే పెదవి విరుస్తున్న పరిస్థితి. సినిమా కౌంట్ డౌన్ దగ్గరపడుతున్న కొద్ది ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని ఎంతలా ఆరాటపడ్డారో.. థియేటర్ లోపలికెళ్లాక.. ఎప్పుడెప్పుడు బయటపడుదామా? అన్నట్లుగా తీవ్ర అసహనానికి లోనయ్యారు. 'అజ్ఞాతవాసి'పై ఓ అభిమాని ఆవేదన.. అసహనం.. అంతా అతని మాటల్లోనే..

     ఇంత వరస్టుగా తీయడమేంది?:

    ఇంత వరస్టుగా తీయడమేంది?:

    చావాల్నా.. బతకాల్నా.. ఇంత వరస్టుగా తీయడమేంది త్రివిక్రమ్, అసలేం అర్థంకాలే. ఆ పాటలేంది.. కనీసం దేవిశ్రీని పెట్టి ఉంటే బాగుండేది. ఇంతకుముందు పవన్ కల్యాణ్‌కు జల్సా, అత్తారింటికి దారేది.. ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇప్పుడీ మ్యూజిక్ డైరెక్టర్ అధ్వాన్నంగా చేసి పారేశాడు.

     ఏడ్వడమే తక్కువ:

    ఏడ్వడమే తక్కువ:

    అసలు సినిమా దేని గురించి తీశాడో.. ఎందుకు తీశాడో.. ఓ ఇంట్రో లేదు.. పాటలు బాగా లేవు. సినిమా కోసం ఇంత ఖర్చు పెట్టుకుంటే ఏమి లాభమొచ్చే.. తలెత్తుకోలేకపోతున్నా. ఏడ్వడం ఒక్కటే తక్కువ.

    దమ్ములేదని అర్థమైంది..:

    దమ్ములేదని అర్థమైంది..:

    పన్నెండున్నర ఒంటిగంటవరకు మేల్కొని తీరా సినిమాలో నిద్రపోతున్నామంటే లెక్కేసుకో.. సినిమా ఎంత వరస్టుగా తీశాడో. త్రివిక్రమ్ ఇంత చెత్త సినిమా తీస్తాడని కలలో కూడా అనుకోలేదు. సినిమా మొదలైన 20నిమిషాలకే అర్థమైంది ఇందులో దమ్ములేదని. నా మైండ్ కూడా సహకరించడంలే సినిమా చూడ్డానికి. నువ్వు నిద్రపో.. నిద్రపో.. అని చెబుతాంది మైండ్.

     హీరోయిన్‌ను అలా చూపిస్తారా?:

    హీరోయిన్‌ను అలా చూపిస్తారా?:

    రేటింగ్స్ సంగతి పక్కనపెట్టయ్యా.. ఇట్టాంటి సినిమాకు ఫ్యాన్స్ కూడా మద్దతిస్తే ఏందయ్యా సంగతి. 20నిమిషాల్లోనే అంతా తేలిపోయింది. పిల్ల మ్యూజిక్ డైరెక్టర్ అసలేం కొట్టినాడు మ్యూజిక్.

    ఆ హీరోయిన్ అనుఇమ్మాన్యుయెల్‌ను మజ్ను సినిమాలో ఎంత బాగా చూపించారు. ఈ సినిమాలో.. ఏంది ఆ మేకప్‌లు.. బీడీలు, సిగరెట్లు తాగుతూ.. లేడీస్‌ను చూపించే పద్దతేనా అది?.

    ఏందీ ఘోరం..:

    ఏందీ ఘోరం..:

    సినిమా హిట్టయితే సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుందామనుకున్నా. ఫుల్ డిసప్పాయింట్. పవన్ కల్యాణ్ కోసం నాలుగైదు బ్యానర్లు కట్టి.., ఇప్పుడు థియేటర్ వైపు వెళ్లాలంటేనే భయమేస్తాంది. ఏంది ఘోరమయ్యా.. దాన్నేమైనా సినిమా అంటారా?

     పవన్ ఎందుకు ఒప్పుకున్నాడో:

    పవన్ ఎందుకు ఒప్పుకున్నాడో:

    దేవిశ్రీని పెడితే మ్యూజిక్ కోసమైనా వెళ్లేవాళ్లు. పాటలు ఎందుకొస్తున్నాయో అర్థం కాదు.. ఎక్కడ పెట్టాడో అర్థం కాదు. ఇంత దరిద్రంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. అసలు పవన్ కల్యాణ్ సార్ ఎందుకీ త్రివిక్రమ్ సినిమా ఒప్పుకున్నాడో అర్థంకాలే.

     వాళ్లను పెట్టి ఉంటే:

    వాళ్లను పెట్టి ఉంటే:

    ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కు బదులు.. సాయి కార్తీక్‌ను పెట్టినా బాగా కొట్టేవాడు. అనసవరంగా తమిళం నుంచి తీసుకొచ్చినారు. మిక్కీ జే మేయర్‌ను పెట్టినా.. నిస్వార్థంగా కొట్టేవాడు. మణిశర్మ అయితే ఒక ఊపేసేవాడు.

     మరో పంజా.. తీన్మార్.. పులి..:

    మరో పంజా.. తీన్మార్.. పులి..:

    ఫేస్ బుక్ లైవ్ లో పెట్టాలనుకుంటున్నా ఇదంతా బాధ. పరమ బోరింగ్ సినిమా. మరో తీన్మార్.. మరో పంజా.. మరో కొమురం పులి.. అందులో సాంగ్స్ అయినా ఉన్నాయి. ఇందులో సాంగ్స్ లేవు, బీజీఎం లేదు.

     పరువు తీయనికే.. ఇదంతా:

    పరువు తీయనికే.. ఇదంతా:

    పవన్ కోసం ప్రాణాలిస్తామనేవాళ్లం.., ఇంత ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేసుకునేవాళ్లం మనకే నచ్చడం లేదు. మనకే నచ్చకపోతే ఇంకా వేరేవాళ్లకేం నచ్చుద్ది. పవన్ కల్యాణ్ పరువు తీయనీకి తీశారీ సినిమా అంతే. ఎలక్షన్స్‌లో దిగే టైంలో అంతా గబ్బు లేపి పెట్టినారు.

    English summary
    A fully dissappointed Pawan Kalyan fan talked about his frustration after watching Agnyaatahvasi movie on Monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X