రామ్ చరణ్‌తో చార్మి మాస్ మసాలా సాంగ్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో హీరోయిన్ చార్మి ఒక రాత్రంతా స్పెండ్ చేసింది. అయితే ఈ వ్యవహారం వెనక దాచాల్సిన విషయం ఏమీ లేదు. సినిమా షూటింగులో భాగంగానే చార్మి రామ్ చరణ్ తో రాత్రంతా గడపాల్సి వచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ వివి వినాయక్ దర్శకత్వంలో 'నాయక్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈచిత్రంలో 'నెల్లూరే..' అనే ఐటం సాంగులో చార్మి రామ్ చరణ్ తో కలిసి స్టెప్పులు వేసింది. మాంచి మాస్ బీట్లతో సాగే ఈ పాటను ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపారు. ఈ విషయం గురించి చార్మి తన ట్విట్టర్లో పేర్కొంటూ.... 'నాయక్ సినిమా కోసం ఫుల్ నైట్ షూటింగులో పాల్గొన్నాను. రామ్ చరణ్ తో కలిసి స్టెప్పులేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సాంగు సూపర్ హిట్టవుతుందనే నమ్మకం ఉంది. సంక్రాంతి వరకు వెయిట్ చేయండి' అంటూ చార్మి ట్వీట్ చేసింది.
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9, 2013న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా.... అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే పాటను రీమిక్స్ చేసారు.
యూనివర్శల్ మీడియా సంస్థ 'నాయక్' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్, నిర్మాత: డివివి దానయ్య, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











