Zee Cine Awards 2023 ది కశ్మీర్ ఫైల్స్‌కు అవార్డుల పంట.. నాటు నాటు పాటకు.. !
ప్రతిష్టాత్మక జీ సినీ అవార్డుల కార్యక్రమం ముంబైలో ఘనంగా జరిగింది. బాలీవుడ్ తారల భారీగా తరలిరావడంతో వేడుక తళతళలాడింది. స్టార్ హీరోలు, హీరోయిన్ల డ్యాన్సులు, ఆటపాటతో ఈ అవార్డుల కార్యక్రమం పండుగను తలపించింది. 2023 సంవత్సరానికి జీ సినీ అవార్డుల కార్యక్రమం అంగరంగవైభవంగా సాగింది. ఈ వేడుకలకు హోస్ట్‌గా ఆయుష్మాన్ ఖురానా, అపర్ శక్తి ఖురానా సోదరులు వ్యవహరించారు. ఈ అవార్డుల వేడుకలో ఆసక్తికరమైన అంశాలు, విజేతల వివరాలు మీ కోసం..
జీ సీనీ అవార్డుల వేడుకలో ఆయుష్మాన్ ఖురానా, అపర్ శక్తి ఖురానా సోదరులతో కలిసి అలియాభట్ సందడి చేసింది. ఈ ముగ్గురు కలిపి RRR సినిమాలోని నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశారు. ఈ పాటకు అతిథుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

ఉత్తమ చిత్రం: ది కాశ్మీర్ ఫైల్స్
ఉత్తమ నటుడు: కార్తీక్ ఆర్యన్ (భూల్ భులయ్యా)
ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగుభాయ్ కతియావాడి)
ఉత్తమ ప్రతినాయకుడు: చిన్నయ్ మండ్లేకర్ (ది కాశ్మీర్ ఫైల్స్)
ది బెస్ట్ స్క్రీన్ ప్లే: ది కాశ్మీర్ ఫైల్స్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: అనిల్ కపూర్ (జుగ్ జుగ్ జీయో)
వ్యూవర్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ ఫీమేల్: ఆలియాభట్ (డార్లింగ్స్)
వ్యూవర్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్: అనుపమ్ ఖేర్ (ది కాశ్మీర్ ఫైల్స్)
పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ మేల్: వరుణ్ ధావన్ (జుగ్ జుగ్ జీయో, భేడియా)
పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్: రష్మీక మందన్న (గుడ్‌బై)
ది కాశ్మీర ఫైల్స్ సినిమాకు వచ్చిన ఉత్తమ చిత్రం అవార్డును పుల్వామా కాల్పుల్లో ఉగ్రవాదుల చేతిలో మరణించిన కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మకు అంకితం ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ.. పీపుల్స్ ఫిల్మ్ ది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్ అవార్డులను గెలుచుకొన్నది. ఈ అవార్డులను కాశ్మీర్‌లో ఉగ్రవాదులు చేతిలో మరణించిన కశ్మీర్ పండిట్ సంజయ్ శర్మకు అంకింతం ఇస్తున్నామని ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











