కేక పుట్టిస్తున్న గోపీ-తాప్సీ రొమాన్స్
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ మొగుడు సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్-తాప్సీ కథానాయకులు. అలకలు, అల్లర్లు, అందాలు, బంధాలు, భావాలు, భావోద్వేగాలు, సరసాలు, సంప్రదాయాలు తెరపై చూపించడంలో కృష్ణవంశీది ప్రత్యేక శైలి. వాటన్నింటి సంగతేమోగనీ....సినిమాలో సరసపు(రొమాన్స్) సన్నివేశాలు మాత్రం బాగా పండాయని సినిమా స్టిల్స్ ను చూస్తే స్పష్టం అవుతోంది. గత సినిమాలో ఎందులోనూ లేని విధంగా తాప్సీ తన అందాలను ఆరబోసిందనడానికి ఈ ఫోటోలే నిదర్శనం. గోపీచంద్ కూడా ఈ సినిమా దెబ్బతో యాక్షన్ హీరో ఇమేజ్ ను తొలగించకుని రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు.
ఈ సినిమాకు నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాత. గోపీచంద్ లో కొత్త కోణంలో కనిపించబోతున్నాడని సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. డా. రాజేంద్రప్రసాద్ ఇందులో కీలకమైన పాత్ర చేస్తున్నారు. అదే విధంగా నరేష్, రోజా ఇందులో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. . ఇదొక అందమైన కుటుంబ కథ. అలా అని ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే మెచ్చే సినిమా కాదిది. క్లాసు, మాసు అనే తేడా లేకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయంటున్నారు నిర్మాత. దీపావళి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా : శ్రీకాంత్, సమర్పణ : బేబీ భవ్య, నిర్మాణ : లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications











