ఒక బడా నిర్మాత మత్తు మంది కలిపి డోర్ పెట్టేశాడు.. ఆ ఘటన మర్చిపోలేను: ఫన్ బకెట్ భార్గవి

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిన్న తరహా నటీమణుల నుంచి బిగ్ స్క్రీన్ స్టార్ హీరోయిన్స్ వరకు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఇబ్బందుల ఎదుర్కోక తప్పడం లేదు. చాలా వరకు యాక్టర్స్ ఈ విషయాలను ఓపెన్ గానే బయటకు చెప్పేస్తున్నారు. ఇక ఇటీవల ఫన్ బకెట్ భార్గవి కూడా క్యాస్టింగ్ కౌచ్ చేదు అనుభవాలను చెప్పడం ఓ వర్గం వారిని షాక్ కి గురి చేసింది.

ధైర్యం చేయడం లేదు.

ధైర్యం చేయడం లేదు.

చిన్న అవకాశం వస్తే చాలు ఎలాగైనా తమ టాలెంట్ ని నిరూపించుకోవాలని యువ నటీనటులు ఎంతగానో ఆశపడతారు. కానీ కొందరి కామ ఆలోచనల కారణంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న యాక్టర్స్ భయపడి వెనక్కి వెళ్లిపోతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ప్రతి చోట ఉందని అనేంతలా ప్రచారాలు జరగడంతో ఆడపిల్లలను ఇండస్ట్రీకి పంపడానికి చాలా మంది తల్లి దండ్రులు ధైర్యం చేయడం లేదు.

ఫన్ బకెట్ భార్గవి షాకింగ్ కామెంట్స్

ఫన్ బకెట్ భార్గవి షాకింగ్ కామెంట్స్

ఇక ఇదే విషయంపై ఫన్ బకెట్ భార్గవి కూడా ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేసింది. తాను కూడా కొన్ని సందర్భాల్లో క్యాస్టింగ్ కౌచ్ వల్ల చాలా భయానికి గురయ్యాను అని ఒక బడా నిర్మాత చేసిన పని తీవ్రంగా అసంతృప్తిని కలిగించిందని ఇటీవల ఇచ్చిమ ఇంటర్వ్యూలో భార్గవి వివారించింది. అయితే చివరి నిమిషంలో తాను తప్పించుకున్నట్లు తెలిపింది.

డోర్ లాక్ చేశాడు..

డోర్ లాక్ చేశాడు..

భార్గవి మాట్లాడుతూ.. సినిమాలో హీరోయిన్ గా అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఒక నిర్మాత ఆఫీస్ కి రమ్మన్నారు. వెళ్ళాక ఒక రూమ్ లోకి పిలిచాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి డోర్ లాక్ చేసి వెళ్లిపోయాడు. నిర్మాతతో నేను ఒక్క దాన్నే ఉన్నాను. నేను ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా సైలెంట్ గా అలానే కూర్చున్నాను.

ఏమైనా ఉందా లేదా? ఇస్తావా?

ఏమైనా ఉందా లేదా? ఇస్తావా?

కొంత సేపటికి నిర్మాత మెల్లగా మాటలతో నన్ను ఫ్లట్ చేసే ప్రయత్నం చేశాడు. అవుట్ డోర్ లోనే షూటింగ్ ఎక్కువగా ఉంటుంది. మరి నా పరిస్థితి ఏంటి? ఏమైనా ఉందా లేదా? ఇస్తావా? అని అన్నాడు. నేను ఏ మాత్రం కౌంటర్ ఇవ్వకుండా అక్కడ నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని అనుకున్నాను.

ఆ కూల్ డ్రింక్ లో ఎదో పౌడర్..

ఆ కూల్ డ్రింక్ లో ఎదో పౌడర్..

వెంటనే కూల్ డ్రింక్ తాగమని అన్నారు. కానీ అందులో ఒక పౌడర్ ఎదో కలిపి ఉంది. నా అనుమానం ఇంకా బలపడింది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మా అమ్మ ఫోన్ చేస్తోంది అంటూ ఫోన్ రాకపోయినా మాట్లాడుకుంటూ అలా బయటకు వెళ్లిపోయా.

Recommended Video

Rajamouli Movie Official Trailer
 దాదాపు సగం మంది అలాంటి వారే..

దాదాపు సగం మంది అలాంటి వారే..

క్యాస్టింగ్ కౌచ్ సమస్య అనేది అంతకుముందు కూడా నాకు మూడు సార్లు ఎదురయ్యాయి. కానీ వారు అడిగిన కమిట్మెంట్ కి నేను ఏ మాత్రం ఒప్పుకోలేదు. కానీ ఆ నిర్మాత చేసిన పనికి మాత్రం ఎంతగానో భయపడ్డాను. ఇండస్ట్రీలో అందరూ అలా ఉంటారని నేను అనడం లేదు. కానీ దాదాపు సగం మంది అలాంటి వారే అని భార్గవి వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X