సంపూర్ణేష్ బాబు కాళ్ల మీద పడ్డ అభిమాని.... నిర్మాతే అలా చేయించాడంటూ షాక్!

స్టార్ హీరోల సినిమా ఈవెంట్లు జరుగుతుంటే అభిమానులు సెక్యూరిటీ వలయాన్ని చేధించుకుని వచ్చి వారి కాళ్ల మీద పడటం తరచూ చూస్తూనే ఉన్నాం. గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇటీవల డియర్ కామ్రేడ్ మూవీ ఈవెంటులో విజయ్ దేవరకొండకు, రణరంగం మూవీ ఈవెంటులో శర్వానంద్‌కు అభిమానుల నుంచి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. తాజాగా సంపూర్ణేష్ బాబు విషయంలో కూడా ఇలాంటి సీనే రిపీట్ అయింది. ఓ అభిమాని స్టేజీ మీదకు దూసుకొచ్చి సంపూర్ణేష్ బాబుకాళ్ల మీద పడ్డారు. సంపూకు ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారా? అనే ఆలోచన వచ్చేలోపే ఊహించని షాక్ తగిలింది.

అభిమాని నుంచి ఊహించని సమాధానం

అభిమాని నుంచి ఊహించని సమాధానం

స్టేజీ మీదకు వచ్చి సంపూ కాళ్లు పట్టుకున్న వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి లాగేశారు. అయితే వెంటనే సంపూ ఆ అభిమానిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని అతడితో సెల్ఫీలకు ఫోజులు ఇచ్చాడు. ఎందుకు ఇలా నా కాళ్ల మీద పడ్డావు... నేను అంత గొప్పపని ఏం చేశాను? అని సంపూ ప్రశ్నించగా ఆ అభిమాని నుంచి ఊహించని సమాధానం వచ్చింది.

ప్రొడ్యూసర్ చేయమంటేనే అలా చేశా

ప్రొడ్యూసర్ చేయమంటేనే అలా చేశా

మీ కాళ్ల మీద పడమని ప్రొడ్యూసర్ గారు చెప్పారు, అందుకే ఇలా పరుగెత్తుకుంటూ వచ్చి మీ కాళ్ల మీద పడ్డాను. అంతకు మించి ఏమీ లేదు అంటూ సదరు అభిమాని బదులిచ్చారు. దీంతో అతడు చెప్పిన విషయం విని షాకవ్వడం బర్నింగ్ స్టార్ వంతైంది.

సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్

సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్

ఈ మధ్య కాలంలో కొందరు అభిమానులు హీరోల కాళ్ల మీద పడుతున్న సంఘటనలపై సెటైరిక్‌గా దీన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సినిమాకు ప్రమోషన్ పరంగా కలిసొస్తుందని ఇలా చేశారని అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ ఇన్సింటుపై ఫన్నీ ట్రోల్స్ దర్శనమిస్తున్నాయి.

కొబ్బరి మట్ట

కొబ్బరి మట్ట

'హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు త్వరలో 'కొబ్బరి మట్ట'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కెరీర్లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తూ భారీ డైలాగులు పేల్చబోతున్నాడు.ఈ చిత్రంలో సంపూ.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ ఇలా మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. ఆగస్టు 10న ఈ మూవీ విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X