twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లీవ్ అంటూ... సోషల్ మీడియాలో ‘బాహుబలి’ రచ్చ!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి సినిమా కోసం లీవ్ లెటర్స్ అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ లీవ్ లెటర్లు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఫోటలో కనిపిస్తున్న లీవ్ లెటర్ ఫేస్ బుక్ లో హడావుడి చేస్తోంది. ఫోటో కింద ఉన్న లెటర్ వాట్సాఫ్ లో హల్ చల్ చేస్తోంది. అవేమిటో మేం చెప్పడం కన్నా మీరు చదివితేనే మరింత ఫన్నీగా ఉంటుంది.

     హైదరాబాద్: బాహుబలి సినిమా కోసం లీవ్ లెటర్స్ అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ లీవ్ లెటర్లు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఫోటలో కనిపిస్తున్న లీవ్ లెటర్ ఫేస్ బుక్ లో హడావుడి చేస్తోంది. ఫోటో కింద ఉన్న లెటర్ వాట్సాఫ్ లో హల్ చల్ చేస్తోంది. అవేమిటో మేం చెప్పడం కన్నా మీరు చదివితేనే మరింత ఫన్నీగా ఉంటుంది. PHOTo Leller తేదీ 09.07.2015 గౌరవనీయులైన సీఈవో గారికి, విషయం : విడుదల రోజు బాహుబలి సినిమా చూడడానికి శుక్రవారం సెలవు గురించి. నేను మీ కంపెనీలో పనిచేసే సగటు ఉద్యోగిని. నాకు ఈ శుక్రవారం సెలవు కావాలి. ఎందుకంటే నా ఫ్యామిలీకి బాహుబలి సినిమా చూపించడం కోసం. సినిమా చూడడానికి సెలవెందుకు అని మీరడగవచ్చు. కానీ ఈ సినిమా చూపించకపోతే నా ఫ్యామిలీ నాకు దక్కేట్టు లేదు. నా కొడుకు గడికోసారి నేనెవర్నీ… నేనెవర్నీ… అని అరుస్తున్నాడు. నా కూతురు జై మాయుష్మతీ అంటూ నిద్రలో కలవరిస్తుంది. నా భార్య అయితే మాటిమాటికీ మాయిష్మతికి మకిలి పట్టిందీ… రక్తంతో కడిగేయ్… అంటూ దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తుంది. నాకేమో భల్లాల దేవ కల్లోకి వస్తున్నాడు… అప్పుడప్పుడు అవంతిక డ్రీమ్స్ లోకి వచ్చి టెంప్ట్ చేస్తుందనుకోండి (ఇది పర్సనల్) నిన్న రాత్రి మా ముసలామె యాక్షన్, కెమెరా అంటూ ఆగమాగం చేసింది. ఓసేయ్ ముసలి ఏమయ్యిందే నీకు అంటే …అరెయ్ నన్ను డిస్టర్బ్ జేయకు నేను రాజమౌళి ని అంటూ మల్లీ యాక్షన్, కెమెరా, స్టార్ట్ అంటుంది. సార్ ఇక నా వల్ల కాదు…ఆ మోషన్ పిక్చర్ చూపించకపోతే మావాళ్లు నాకు మోషన్స్ తెప్పించేలా ఉన్నారు. మూడు సంవత్సరాలు సినిమా షూటింగ్ అయ్యేదాకా ఆగారు. కానీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాక మూడు నిమిషాలు కూడా ఆగేలా లేరు నా ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి పై విషయాలను దృష్టిలో ఉంచుకుని నాకు శుక్రవారం సెలవు ఇవ్వగలరని నా మనవి. కృతజ్ఞతాభినందనలతో… మీ విధేయుడు అమరేంద్ర బాహుబలి సారీ… సినిమా సీను.

    తేదీ 09.07.2015

    గౌరవనీయులైన సీఈవో గారికి,
    విషయం : విడుదల రోజు బాహుబలి సినిమా చూడడానికి శుక్రవారం సెలవు గురించి.

    నేను మీ కంపెనీలో పనిచేసే సగటు ఉద్యోగిని. నాకు ఈ శుక్రవారం సెలవు కావాలి. ఎందుకంటే నా ఫ్యామిలీకి బాహుబలి సినిమా చూపించడం కోసం. సినిమా చూడడానికి సెలవెందుకు అని మీరడగవచ్చు. కానీ ఈ సినిమా చూపించకపోతే నా ఫ్యామిలీ నాకు దక్కేట్టు లేదు.

    నా కొడుకు గడికోసారి నేనెవర్నీ... నేనెవర్నీ... అని అరుస్తున్నాడు. నా కూతురు జై మాయుష్మతీ అంటూ నిద్రలో కలవరిస్తుంది. నా భార్య అయితే మాటిమాటికీ మాయిష్మతికి మకిలి పట్టిందీ... రక్తంతో కడిగేయ్... అంటూ దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తుంది. నాకేమో భల్లాల దేవ కల్లోకి వస్తున్నాడు... అప్పుడప్పుడు అవంతిక డ్రీమ్స్ లోకి వచ్చి టెంప్ట్ చేస్తుందనుకోండి (ఇది పర్సనల్) నిన్న రాత్రి మా ముసలామె యాక్షన్, కెమెరా అంటూ ఆగమాగం చేసింది. ఓసేయ్ ముసలి ఏమయ్యిందే నీకు అంటే ...అరెయ్ నన్ను డిస్టర్బ్ జేయకు నేను రాజమౌళి ని అంటూ మల్లీ యాక్షన్, కెమెరా, స్టార్ట్ అంటుంది.

    సార్ ఇక నా వల్ల కాదు...ఆ మోషన్ పిక్చర్ చూపించకపోతే మావాళ్లు నాకు మోషన్స్ తెప్పించేలా ఉన్నారు. మూడు సంవత్సరాలు సినిమా షూటింగ్ అయ్యేదాకా ఆగారు. కానీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాక మూడు నిమిషాలు కూడా ఆగేలా లేరు నా ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి పై విషయాలను దృష్టిలో ఉంచుకుని నాకు శుక్రవారం సెలవు ఇవ్వగలరని నా మనవి.
    కృతజ్ఞతాభినందనలతో... మీ విధేయుడు అమరేంద్ర బాహుబలి సారీ... సినిమా సీను.

    English summary
    Funny Leave letter about Baahubali movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X