రజనీకాంత్-అక్షయ్ కుమార్ మూవీ 2.0 టీజర్‌పై ఫన్నీ మీమ్స్
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 2.0 టీజర్ ఇటీవల వినాయక చవితి సందర్భంగా విడుదలై రికార్డు స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కొన్ని గంటల్లోనే కోట్లాది మంది ఈ టీజర్ వీక్షించారు.
తెలుగు, తమిళం, హిందీలో టీజర్ విడుదలవ్వగా.... 48 గంటల్లో 46.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇందులో యూట్యూబ్ నుండి 37.1 మిలియన్ వ్యూస్, ఫేస్ బుక్ నుండి 5.4 మిలియన్ వ్యూస్, ఇన్‌స్టాగ్రామ్ నుండి 3.9 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అదే సమయంలో సోషల్ మీడియాపై కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా దర్శనమిస్తున్నాయి. రజనీకాంత్ అభిమానులు, అక్షయ్ కుమార్ అభిమానులు పోటీ పడి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో శంకర్ దర్శకత్వం వహించిన '2.0' మూవీ ... 2010లో వచ్చిన యంతిరన్(రోబో) చిత్రానికి కొనసాగింపుగా చిత్రీకరించారు. నవంబర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్ పెర్ఫార్మెన్స్‌తో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు హైలెట్ కాబోతోంది. హిందీలో ధర్మా ప్రొడక్షన్స్ బేనర్లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











