ఫన్నీ ఫోటోలు : సమంతకు పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం
హైదరాబాద్ : పవర్ స్టాన్ పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత కలిసి నటిస్తున్న సినిమా 'అత్తారింటికి దారేది'. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో ఓ ఫోటోలో సమంత పవన్ కళ్యాణ్‌ను నమస్కరించగా, పవన్ కళ్యాణ్ ఆశీర్వదిస్తున్నట్లు ఉంది. బహుషా ఇది సినిమాలో ఓ సీన్లో భాగమని భావిస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత, అలీ, బ్రహ్మాజీ సెట్లో కలిసి దిగిన ఫోటోలు చాలా బాగున్నాయి. సినిమా షూటింగు మధ్యలో టీబ్రేక్‌లో వాళ్లు ఇలా ఫోటోలకు ఫోజు ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. త్వరలో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఫోటోలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన వివరాలు, విడుదల విశేషాలు, ఆడియో విడుదల ఎప్పుడు అనే వివరాలతో పాటు, తాజాగా విడుదలైన ఆసక్తికర ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి......

‘అత్తారింటికి దారేది' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత దీన్ని వర్కింగ్ టైటిల్ గా అనుకున్నప్పటికీ చివరకు దాన్నే ఫైనల్ చేసారు. ఈ చిత్రం పూర్తి స్థాయి ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో కనిపించనున్నాయి.

ఈ చిత్రాన్ని ఆగస్టు 7న వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. గబ్బర్ సింగ్ లాంటి హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇది. ఈ చిత్రానికి ‘అత్తారింటికి దారేది' టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అవుతుందని దాన్నే ఖరారు చేసాం' అన్నారు నిర్మాత. అందుకు తగిన విధంగానే ఈ సినిమాలో భారీ తారాగణం తీసుకున్నారు.

ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నారు. ఓ కామోడీ సీన్లో ఆయన ‘అత్తాపూర్ బాబా' గెటప్‌లో దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మానందం, అలీలు కూడా ఈ కామెడీ సీన్లో కనిపిస్తారు. గతంలో గుడుంబా శంకర్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్, అలీ, బ్రహ్మానందం మీద స్వామీజీ గెటప్‌లో ఓ సీన్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి బోమన్ ఇరానీ నటిస్తుండటం గమనార్హం. ఆయన నటిస్తున్న తొలిసినిమా ఇదే. మరో వైపు మిర్చి చిత్రంలో ప్రభాస్ తల్లిగా నటించిన నదియా కూడా ఈచిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

'అత్తారింటికి దారేది' చిత్రం సెట్స్ పై సమంత, బ్రహ్మానందం ఇలా స్టిల్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











