చంద్రయాన్ 2: దిశా పటానీ గురించి ఈ ట్వీట్ చూస్తే నవ్వడం ఖాయం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల చంద్రయాన్ 2 ప్రయోగం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా విక్రమ్ అనే ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపి పరిశోధన జరుపాలనేది ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. అయితే చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ తెగిపోవడంతో అంతరాయం ఏర్పడింది. శాస్త్రవేత్తలు దీన్ని పునరుద్దరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా.. 'చంద్రయాన్ 2' ప్రయోగం తర్వాత పలువురు సెలబ్రిటీలు ఇస్రో చేసిన ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. ఇలా ట్వీట్ చేసిన వారిలో బాలీవుడ్ నటి దిశా పటానీ కూడా ఉన్నారు. అయితే దిశా పటానీ చేసిన ట్వీటుపై ఓ అభిమాని రియాక్ట్ అయిన తీరు అందరినీ నవ్విస్తోంది.
చంద్రయాన్ 2 గురించి దిశా పటానీ ట్వీట్
‘‘చంద్రయాన్ 2 మిషన్లో భాగం అయిన వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇస్రోకు ధన్యవాదాలు. ఈ ప్రయోగం విషయంలో ఎంతో ఎఫర్ట్ పెట్టి మీరు అందరికీ స్పూర్తిగా నిలిచారు'' అని దిశా పటానీ తన ట్విట్టర్ పేజీలో వ్యాఖ్యానించారు. చంద్రయాన్ 2 అనే ట్యాగ్‌తో చేసిన ఈ ట్వీట్ వెంటనే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది.
దిశా పటానీ పేరుతో ఫన్నీ ట్వీట్
అయితే దిశా పటానీ ట్వీట్ చూసిన ఓ అభిమాని ఆసక్తిగా స్పందించారు. ‘‘విక్రమ్ ల్యాండర్ మీ పేరు లాగే ఎందుకు అలా ప్రవర్తిస్తోందో అర్థం కావడం లేదు'' అంటూ వ్యాఖ్యానించారు. దిశా అంటే విక్రమ్ ల్యాండర్ దిశ... పతా-నహి(తెలియడం లేదు) అనే మీనింగుతో ఈ ఫన్నీ ట్వీట్ చేశారు.

నవ్వులు పూయిస్తున్న ట్వీట్
దిశా పటానీ పేరును విక్రమ్ ల్యాండర్‌తో పోలుస్తూ చేసిన ఈ ట్వీట్ ఇంటర్నెట్లో నవ్వులు పూయిస్తోంది. పలువురు నెటిజన్లు దీన్ని షేర్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ ఎఫెక్టుతో ఆమె పేరు మారుమ్రోగిపోతోంది.

దిశా పటానీ
దిశా పటానీ సినిమా కెరీర్ విషయానికొస్తే.. తెలుగు మూవీ ‘లోఫర్' ద్వారా ఆమె తెరంగ్రేటం చేశారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. ఆ తర్వాత హిందీలో ‘ఎంఎస్ ధోని', భాగీ 2, భారత్ చిత్రాల్లో నటించింది. కుంగ్ ఫు యోగా అనే చైనీస్ మూవీలో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం ‘మలాంగ్' అనే చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











