Raja Vikramarka : డ్యాన్సులతో అదరగొట్టిన కార్తీకేయ, తాన్యా రవిచంద్రన్.. సింగిల్ షాట్ లో అద్భుతం

ప్రేమతో మీ కార్తీక్ అనే ఒక సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు టాలెంటెడ్ హీరో కార్తికేయ.. అయితే చేసిన రెండో సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ తర్వాత వరుస వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. రెండో సినిమా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్న కార్తికేయ చేస్తున్న ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.. అందులో భాగంగానే హీరో కార్తికేయ తాజాగా న‌టిస్తోన్న చిత్రం రాజా విక్ర‌మార్క. తాన్య ర‌విచంద్ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆమె అలనాటి స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు కావడం గమనార్హం. టైటిల్‌ రిజిస్టర్‌ చేశాక చిరంజీవిగారికి పంపించామని ఆయన 'గుడ్‌ లక్‌' అన్నారని కూడా కార్తికేయ వెల్లడించారు.

చిరంజీవిగారి మీద అభిమానంతో ఆయన సినిమా టైటిల్‌ పెట్టుకున్నానని ఇమేజ్, మార్కెట్‌ అంటూ భవిష్యత్‌ గురించి ఆలోచిస్తుంటే తెలియకుండా ఒత్తిడిలోకి వెళ్లి కథలో బేసిక్‌ పాయింట్స్‌ మిస్‌ అవుతున్నాననీ అన్నారు. ఇక న‌వంబ‌ర్ 12న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుదల కావడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పెట్టు కోవడంతో పాటు టీజర్, ట్రైలర్ లు కూడా సినిమా మీద అంచనాలు బాగా పెంచేశాయి. సినిమా రిలీజ్ దగ్గర పడడంతో కార్తికేయ సహా మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. అనేక వైవిధ్యమైన కార్య‌క్ర‌మాల‌తో ఈ ప్రమోషన్స్ ను హోరెత్తిస్తున్నారు.

Fusion dance video of Karthikeya and Tanya Ravichandran released from raja vikramarka

ఇక ఈ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ స‌ర్‌ ప్రైజ్ ఫ్యూష‌న్ డ్యాన్స్ వీడియోను తాజాగా విడుద‌ల చేశారు మేక‌ర్స్.కార్తికేయ‌, తాన్య‌ల‌పై సింగిల్ షాట్‌లో తీసిన ఫ్యూష‌న్ డ్యాన్స్ ను య‌శ్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశాడు. డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీ పీసీ మౌళి సింగిల్ షాట్‌లో ఈ వీడియోను షూట్ చేశారని సినిమా యూనిట్ వెల్లడించింది. 45 సెక్ల‌న‌ పాటు ఉన్న ఈ క్లాసిక‌ల్ బిట్‌ లో కార్తికేయ‌, తాన్య ర‌విచంద్ర‌న్ కెమిస్ట్రీ అదిరి పోయిందనే చెప్పాలి. శ్రీ సరిప‌ల్లి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ చిత్ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో 88 రామారెడ్డి ప్రొడ‌క్ష‌న్‌తో టీ ఆది రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో రాజా విక్ర‌మార్కను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కార్తికేయ ఒక నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారిగా క‌నిపించ‌బోతున్నాడు. అంతేకాక హ్యాపీ డేస్ ఫేమ్ సుధాక‌ర్ కోమాకుల కీల‌క పాత్రలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో తనకు మరో సాలిడ్ హిట్ లభిస్తుంది అని కార్తికేయ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X