twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో అవ్వాలి అంటే డబ్బులు పెట్టాలన్నారు.. ప్రముఖ దర్శకుడికి డబ్బులిచ్చి మోసపోయా: G జాంబీ హీరో

    |

    సినిమా ఇండస్ట్రీలో వెండితెరపై రావడానికి ఈ తరం కొత్తవారు ఎంతగా కష్టపడతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చాలా కాలం పాటు కష్టపడితే గాని కొందరికి సరైన క్రేజ్ అందడం లేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఓవర్ నైట్ స్టార్ అవుతున్నారు. ఇక ఇటీవల ఒకేసారి జాంబీ జానర్స్ లో రెండు సినిమాలు రాగా అందులోని ఒక సినిమా హీరో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    రెండు జాంబీ సినిమాలు

    రెండు జాంబీ సినిమాలు

    అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబీ రెడ్డి ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. అందులో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ నటించడం వలన సినిమాకు కొంత బజ్ పెరగడమే కాకుండా చాలా మంది ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా సపోర్ట్ లభిస్తోంది. అయితే మరో జాంబీ జానర్ లో వచ్చిన సినిమా G జాంబీ. ఈ సినిమాకు పెద్దగా సపోర్ట్ అయితే అందడం లేదు.

    చేదు అనుభవాలపై పాజిటివ్ కామెంట్స్

    చేదు అనుభవాలపై పాజిటివ్ కామెంట్స్

    జీ జాంబీ సినిమా పూర్తిగా కొత్త వారితో తెరకెక్కింది. ఇక సినిమా ప్రమోషన్ లో హీరో ఆర్యన్ తన మాటలతో ఓ వర్గం ఆడియెన్స్ ను బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నాడం. హీరో ఆర్యన్ గౌరా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి వివరణ ఇస్తూనే చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు.

    హీరో అవ్వాలి అంటే..

    హీరో అవ్వాలి అంటే..

    సాధారణంగా నటినటులు అవ్వాలని వచ్చే కొత్త వారిని ఎవరో ఒకరు మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక సినిమా హీరో అవ్వాలి అంటే కొందరు దర్శకులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందట. ఆ విషయంలో నాకు పెద్దగా తప్పు అనిపించలేదని హీరో ఆర్యన్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

    ఆ దర్శకుడు ఇచ్చిన సమాధానం..

    ఆ దర్శకుడు ఇచ్చిన సమాధానం..

    ఆర్యన్ మాట్లాడుతూ.. ఒక దర్శకుడి నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చెప్పి లక్షల్లో డబ్బు డిమాండ్ చేశాడు. నేను ఇచ్చి కూడా మోసపోయాను. మరోసారి వేరొక దర్శకుడు కూడా అలానే అడగడంతో ప్రశ్నించాను. అందుకు అతను ఒక సమాధానం ఇచ్చారు. నువ్వు కొత్త హీరోవి నిన్ను సినిమా పెట్టి తీయ్యాలి అంటే నిర్మాతల చుట్టూ నెలల తరబడి తిరగాలి.

    అలాగే సినిమా ప్లాప్ అయితే మళ్ళీ నేను ఇంకో ఛాన్స్ అందుకోవడానికి 6నెలలు పడుతుంది. ఈ టైమ్ లో నేను బ్రతకాలి అంటే నాకు డబ్బు అవసరం ఉంటుంది కదా అని దర్శకులు సమాధనం ఇచ్చినట్లు ఆర్యన్ తెలిపాడు.

    English summary
    Awe! Director Prashant Verma, who received a special recognition for himself as a different director with the film, later tried to impress with a different film with Kalki. Both films, however, did not make a big profit at the box office commercially. And for the third time he is coming up with an experiment called Never Before..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X