గబ్బర్ సింగ్-2 : సంపత్ మదిలో ‘బెంగాల్ టైగర్’?
'గబ్బర్ సింగ్-2' చిత్రం సరికొత్త కథతో చేస్తున్నామని చెప్పిన సంపత్......ఈ సినిమా గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రీక్వెల్ గానీ, సీక్వెల్ గానీ కాదని స్పష్టం చేసాడు. జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలు దేనికది ఎలా ప్రత్యేకమో, గబ్బర్ సింగ్-2 చిత్రం కూడా ప్రత్యేకమైన కథతో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.
గబ్బర్ సింగ్-2 ఆలోచన తనది కాదని, తాను వేరే కథతో పవన్ కళ్యాన్ ను కలిస్తే.....ముందు గబ్బర్ సింగ్-2 చేసిన తర్వాత ఆ సినిమా చేద్దామని పవన్ కళ్యాణ్ చెప్పాడట. పవన్ కోరిక మేరకు గబ్బర్ సింగ్ -2 చిత్రం కోసం 2 నెలల్లో స్క్రిప్టు రెడీ చేసాడు సంపత్ నంది. ఆయన మాటలు బట్టి గబ్బర్ సింగ్-2 చిత్రం తర్వాత ఆయనతో పవన్ మరో సినిమా చేయబోతున్నాడన్నమాట.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.....సంపత్ నంది మదిలో 'బెంగాల్ టైగర్' అనే టైటిల్ ఆలోచన ఉందట. అవకాశం వస్తే 'గబ్బర్ సింగ్-2' టైటిల్ 'బెంగాల్ టైగర్'గా మారుస్తానని అంటున్నాడు. అయితే ఈ విషయాన్ని తాను ఇప్పుడే ఖరారు చేయలేనని స్పష్టం చేస్తున్నాడు సంపత్. 'ఖుషి' చిత్రంలో పవన్ చెప్పిన 'ఐయామ్ రాయల్ బెంగాల్ టైగర్...సిద్ధూ సిద్ధార్థ రాయ్' అనే డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












