అనిరుధ్ అదరగొట్టేశాడు: పవన్ కళ్యాణ్‌కు ట్రిబ్యూట్ సాంగ్!
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'అజ్ఞాతవాసి' సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటలు విడుదల చేయగా సూపర్ హిట్ అయ్యాయి.
తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ అనిరుధ్ ఓ ట్రిబ్యూట్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోకు మంచి స్పంద వస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేశారు.

సొంత ఖర్చుతో అనిరుధ్ ట్రిబ్యూట్ సాంగ్
‘అజ్ఞాతవాసి' సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా నిర్మాతను ఇబ్బంది పెట్టకుండా తన సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ మీద ట్రిబ్యూట్ రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు అనిరుధ్.

విజువల్స్ బావున్నాయి
చెన్నైలోని 24ఎఎం స్టూడియోస్ లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ వీడియోలో అనిరుధ్ స్వయంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. బ్యాగ్రౌండ్లో పవన్ కళ్యాణ్ విజువల్స్ చూపించిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ దెబ్బతో అనిరుధ్ తెలుగులో దూసుకెళ్లడం ఖాయం
ఇప్పటికే అనిరుధ్ సౌత్‌లో అతితక్కువ కాలంలో ఎదిగిన యువ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ‘అజ్ఞాతవాసి' సినిమాతో అతడు తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయేల్ నటిస్తున్నారు. వీరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 2018జ నవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











