ఇదిగో..వీళ్లు కూడా పవన్ భజనే(వీడియో)
హైదరాబాద్: కేవలం పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ పాటో లేదా పవన్ కళ్యాణ్ ప్రస్దావిస్తూ డైలాగులో పెడితే సినిమా హిట్టైపోతుందా...అదే నిజమనుకుంటున్నారు మన తెలుగు సినిమావాళ్లు. ఎప్పుడో ఒకప్పుడు సరదాగా సినిమాలో తమ అభిమాన హీరో ప్రస్తావన తెస్తే ఫ్యాన్స్ ఆనందపడతారు...కానీ అదే పనిగా ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేయటానికి పవనిజం అంటూ ఏకంగా పాటే పెట్టేస్తే ...థియోటర్స్ కి ఎగబడిపోతారా అంటున్నారు అభిమానులు. రీసెంట్ గా ఆది హీరోగా వచ్చిన గాలిపటం చిత్రం కోసం పవనిజం అంటూ ఓ పాటను చిత్రీకరించి అంతర్జాలంలోకి వదిలి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు...దర్శక,నిర్మాతలు. మీరూ చూడండి ..ఆ వీడియో...
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/OeWZk4K4vv4" frameborder="0" allowfullscreen></iframe></center>
పవన్ తో ...గబ్బర్ సింగ్ 2 చేస్తున్న ...సంపత్ నంది ఇప్పుడు 'గాలి పటం' సినిమాతో నిర్మాతగా మారారు. అతని స్నేహితులు కిరణ్, విజయ్‌లతో కలసి ఎల్.ఎ.టాకీస్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవీన్ గాంధీ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆది, రాహుల్, ఎరికా ఫెర్నాండేజ్, క్రిస్టినా అకీవా ప్రధాన పాత్రధారులు.

సంపత్ నంది మాట్లాడుతూ ''ఏమైంది ఈ వేళ' తరహాలోనే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. దర్శకుడు నవీన్ గాంధీని సినిమాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నాడు. రొటీన్‌కు భిన్నంగా నవ్యమైన ప్రేమకథతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. '' అన్నారు
ప్రీతిరాణా, పోసాని కష్ణమురళి, సప్తగిరి, వేణు, చంద్ర, దువ్వాసి మోహన్, శ్రీమన్నారాయణ, రామారావు, ప్రగతి, హేమ, శకుంతల, గీతాంజలి, రేఖ, రత్నాసాగర్, పావలా శ్యామల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: సంపత్‌నంది, కిరణ్ ముప్పువరపు, విజయకుమార్ వట్టికూటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యం.యస్.కుమార్.


Click it and Unblock the Notifications











