»   » నా కలనెరవేరింది.. దేశమంతా ఎదురుచూస్తున్నది..

నా కలనెరవేరింది.. దేశమంతా ఎదురుచూస్తున్నది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

భవిష్యత్తులో మంచి సినిమాలు చాలా రావడానికి ఘాజీ స్ఫూర్తిగా నిలువబోతున్నదని దగ్గుబాటి రానా అన్నారు. తెలుగులో గొప్ప సినిమాలు రావాలని కలలు కనేవాడ్ని. ఆ కల ఘాజీతో సాధ్యమైందని ఆయన తెలిపారు. రానా హీరోగా తెరకెక్కిన చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. సంకల్స్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది.

 Gaazi will inspire for many good movies, says Rana Daggubati

ఇటీవల హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రానా మాట్లాడుతూ 'ఏం సినిమా చేస్తున్నావని కలిసినప్పుడల్లా నా స్నేహితులు అడిగేవారు. సబ్‌ మెరైన్‌ నేపథ్యంగా సినిమా చేస్తున్నానని చెప్పడగానే పిచ్చోడిని చూసినట్టు చూసేవారు. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం అరుదైనది' అని అన్నారు. ఈ సినిమా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని చిత్ర హీరోయిన్ తాప్సీ తెలిపారు.

English summary
Rana Daggubati reveals about his latest movie Gaazi. Rana said Gaazi would be inspiration for furthur movies.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu