గబ్బర్ : ఇలియానా ఆశలు గల్లంతు

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ..'హీరోయిన్ పాత్రకు సంబంధించిన స్క్రిప్టు మళ్లీ కొత్తగా రాస్తున్నాం. స్ర్కిప్టు ప్రకారం ఏ హీరోయిన్ సెట్టయితే వారినే తీసుకుంటామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం' అన్నారు. సంజయ్ లాలా బన్సాలీ ప్రకటనతో ఇలియానా ఆశలు గల్లంతయినట్లే అని చెప్పక తప్పదు.
అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న 'గబ్బర్' చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్నారు. వేదం, గమ్యం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల నుంది. తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందిన 'ఠాగూర్' చిత్రానికి ఇది రీమేక్.
బర్ఫీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తొలి సినిమాతోనే భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బర్ఫీ తర్వాత షాహిద్ కపూర్ సరసన 'పతా పోస్టర్ నిక్లా హీరో' సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈ గోవా భామ.


Click it and Unblock the Notifications