»   » గోవాలో భార్యతో జాలీగా ‘గబ్బర్ సింగ్-2’ డైరెక్టర్ (ఫోటోస్)

గోవాలో భార్యతో జాలీగా ‘గబ్బర్ సింగ్-2’ డైరెక్టర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గబ్బర్ సింగ్-2 చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ) ప్రస్తుతం ఖాళీ టైం దొరకడంతో గోవాలో జాలీగా గడుపుతున్నాడు. భార్య అనూషతో కలిసి గోవా పకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా ద్వారా విడుదలయ్యాయి.

కెఎస్ రవీంద్ర గురించి వివరాల్లోకి వెళితే గుంటూరుకు చెందిన రవీంద్ర పొలిటికల్ రౌడీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి తనదైన టాలెంటుతో స్క్రీన్ రైటర్ గా, స్టోరీ రైటర్ గా, దర్శకుడిగా ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ వచ్చాడు. రవితేజ హీరోగా వచ్చిన ‘పవర్' సినిమాతో బాబీ దర్శకుడిగా మారాడు.

తన రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్ 2' చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఇటీవల గబ్బర్ సింగ్ 2 మొదటి షెడ్యూల్ పూర్తయింది. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా షూటింగులో జాయిన్ కాలేదు. త్వరలోనే ప్రారంభం అయ్యే సెకండ్ షెడ్యూల్‌లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు.....

గోవాలో
  

గోవాలో

గోవా బీచ్ లో భార్య అనూషతో కలిసి బాబీ.

సెల్ఫీ
  

సెల్ఫీ

గోవాలో తను బస చేస్తున్న హోటల్ వద్ద బాబీ సెల్ఫీ మూమెంట్

భార్యతో కలిసి
  

భార్యతో కలిసి

భార్యతో కలిసి సెల్ఫీ ఫోజులు ఇచ్చిన రవీంద్ర.

బైక్ పై చక్కర్లు
  

బైక్ పై చక్కర్లు

భార్యతో కలిసి గోవా వీధుల్లో బైక్ మీద చక్కర్లు కొడుతున్న దృశ్యం.

సెల్ఫీ పుల్ల
  

సెల్ఫీ పుల్ల

సెల్పీ పుల్లతో సెల్ఫీ షాట్...

హ్యాపీ కపుల్
  

హ్యాపీ కపుల్

వీరు ఇటీవలే గోవా వెళ్లినట్లు సమాచారం.

Please Wait while comments are loading...