హమ్మయ్య...‘గబ్బర్ సింగ్ 2’కు టైం ఫిక్సయింది!
హైదరాబాద్: గబ్బర్ సింగ్-2 చిత్రం ఎట్టకేలకు రెగ్యులర్ షూటింగ్ జరుపుకునేందుకు రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈచిత్రం గత కొన్ని రోజుల క్రితమే లాంచనంగా పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గోపాలా గోపాలా' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తవగానే 'గబ్బర్ సింగ్ 2' షూటింగులో పవన్ కళ్యాణ్ పాల్గొన బోతున్నాడు. ఈ చిత్రంలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా మందిని వడపోసిన తర్వాత కాజల్‌ను పవన్ ఫైనల్ చేసారని చెప్తున్నారు.

ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు ప్రొడక్షన్ టీం సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ చకచకా పూర్తి చేసుకుంటూ వెలుతోంది. 'గబ్బర్ సింగ్' చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో 'గబ్బర్ సింగ్ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రానికి రచన పర్యవేక్షణ సీనియర్ రచయిత సత్యానంద్, క్రియేటివ్ హెడ్ : హరీష్ పాయ్, రచన సహకారం శ్రీధర్ సీపని, కిషోర్ గోపు, ఛాయాగ్రహణం : జయనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్ : గౌతమ్ రాజు, ఆర్ట్ డైరక్టర్ : ఆనంద్ సాయి, కాస్ట్యూమ్స్ డిజైనర్ : రాజేష్, ప్రొడక్షన్ కంట్రోలర్ : సి భాస్కర రాజు, నిర్మాత : శరత్ మరార్.


Click it and Unblock the Notifications











