‘గబ్బర్ సింగ్-2’ విడుదల తేదీ ఖరారు!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో 'గబ్బర్ సింగ్-2' చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ చివర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. సినిమా ఇంకా మొదలు కానప్పటికీ.....ముందస్తుగా పక్కా ప్లానింగుతో రెడీ అయ్యారు దర్శక నిర్మాతలు. దర్శకుడు సంపత్ నంది ఇప్పటికే స్క్రిప్టు వర్కు పూర్తి చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
సినిమా మొదలైన తర్వాత....అంతా ప్లానింగ్ ప్రకారం, అనుకున్న రోజు అనుకున్న షెడ్యూల్ పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విడుదల తేదీ విషయంలో కూడా ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చారు. 2012లో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం విడుదలైన తేదీనే అంటే...మే 11, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు.
గబ్బర్ సింగ్ తొలి భాగం గుంటూరు జిల్లా కొండవీడు నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్‌గా దర్శనమిచ్చారు......సీక్వెల్ గబ్బర్ సింగ్ 2లోనూ పవన్ క్యారెక్టర్ అదే అయినప్పటికీ, సినిమా మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications












