‘గబ్బర్ సింగ్-2’ రిలీజ్ డేట్ ఖరారైందా?
హైదరాబాద్: ‘గబ్బర్ సింగ్-2' సినిమా ఇంకా షూటింగే మొదలు కాలేదు...అప్పుడే రిలీజ్ డేట్ ఏమిటా అనుకుంటున్నారా? ఇప్పటి వరకు సినిమా మొదలు కానప్పటికీ మే నెలాఖరున ప్రారంభం అవుతుందని తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం. ‘పవర్' మూవీ ఫేం కెఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2016 సంక్రాంతి నాటికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
'గబ్బర్ సింగ్ ' చేసేటప్పటికి పవన్ కల్యాణ్...రాజకీయంగా ఏక్టివ్ గా లేరు. ఇప్పుడు సీన్ మారింది. 'గబ్బర్ సింగ్ 2' చేస్తున్న ఈ సమయంలో ఆయన రాజకీయంగానూ పూర్తి ఏక్టివ్ గా ఉన్నారు. అవసరమైతే ఉద్యమాలు చేస్తానంటున్నారు. ఈ నేపధ్యంలో 'గబ్బర్ సింగ్ 2' స్క్రిప్టుని ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ చిత్రం తన పొలిటికల్ ఇమేజ్ కు ఏ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమని ఆయన మ్యానరిజంలు దగ్గరనుంచి, డైలాగులు దాకా ప్రతీది ఆచి తూచి అడుగు వేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అందుకనే లేటు అయినట్లు చెప్పుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ స్వయంగా స్క్రిప్టు పనుల్ని పర్యవేక్షిస్తూ సినిమాను ప్రారంభించారు. అయితే రకరకాల కారణాల వల్ల ఆ చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు అన్నీ ఓ కొలిక్కి రావడంతో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన అధికారి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications