పవన్ సినిమాపై ఈ రూమర్స్ పుట్టించేది ఎవరో...

By Srikanya

హైదరాబాద్ : గత రెండు రోజులుగా వెబ్ మీడియాలో ఎక్కడ విన్నా... పవన్ కల్యాణ్ 'గబ్బర్‌సింగ్‌ 2'చిత్రం ఆగిపోయిందనే వార్తలే. దాంతో
వెబ్ మీడియాలో ,సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో జరుగుతున్న ప్రచారాన్ని సంపత్‌ నందితో పాటు ఆ సినిమా నిర్మాత శరత్‌ మరార్‌ ఖండించారు. ఆ సినిమా ఖచ్చితంగా ఉందనీ, ఈ ఏడాది సెట్స్‌మీదకు వెళ్లడం ఖాయమనీ స్పష్టం చేశారు. ఈ ప్రచారం గురించి సంపత్‌నూ, శరత్‌మరార్‌నూ మీడియావారు సంప్రదించగా, అవన్నీ కేవలం రూమర్స్ గా కొట్టేశారు.

నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ ''పవన్‌కల్యాణ్‌ ఏక కాలంలో ఒకే సినిమాను చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆయన 'గోపాల గోపాల' చిత్రాన్ని చేస్తున్నారు. ఆగస్ట్‌లో పది రోజులు, సెప్టెంబర్‌లో పది రోజులు ఆ సినిమాకు ఆయన డేట్లు ఇచ్చారు. దాంతో ఆయన పార్ట్‌ పూర్తవుతుంది. మా 'గబ్బర్‌సింగ్‌ 2' అక్టోబర్‌ ద్వితీయార్ధంలో సెట్స్‌ మీదకు వెళ్తుంది. ఇందులో సందేహమే లేదు'' అని తేల్చి చెప్పారు. ఈ సినిమా ఉండదనే ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. పవన్‌తో తాను 'గబ్బర్‌సింగ్‌ 2' చేయడం ఖాయమని దర్శకుడు సంపత్‌ స్పష్టం చేశారు.

'Gabbar Singh 2's Regular Shoot very soon !

ఇక 'అత్తారింటికి దారేది' చిత్రం తర్వాత సంపత్‌ నంది దర్శకత్వంలో 'గబ్బర్‌సింగ్‌ 2' చేయడానికి పవన్‌కల్యాణ్‌ నిర్ణయించుకున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభించారు కూడా. ''ఇది 'గబ్బర్‌సింగ్‌'కు సీక్వెల్‌ కాదు. కొత్త కథతో సంపత్‌ ఈ మూవీని డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుతాం'' అని అప్పుడు శరత్‌ మరార్‌ ప్రకటించారు. అయితే ఈలోగా పవన్‌కల్యాణ్‌ 'గోపాల గోపాల' సినిమాను చేయడానికి అంగీకరించారు.

అయితే బాలీవుడ్‌ హిట్‌ ఫిల్మ్‌ 'ఓ మై గాడ్‌'కు రీమేక్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్‌ ప్రధాన పాత్ర చేస్తుండగా, కీలకమైన శ్రీకృష్ణుడి పాత్రను పవన్‌కల్యాణ్‌ చేస్తున్నారు. దీంతో 'గబ్బర్‌సింగ్‌ 2' సినిమాపై నెగటివ్‌ ప్రచారం మొదలైపోయింది. సంపత్‌ ఇప్పటికి చాలా కథలు వినిపించినా, వాటిలో ఒక్కటి కూడా పవన్‌కు నచ్చలేదనీ, అందుకే ఆ సినిమాని చేయకూడదని పవన్‌ నిర్ణయించుకున్నాడనీ విరివిగా ప్రచారంలోకి వచ్చింది. 'రచ్చ' సినిమా చేసి చాలా కాలమైనా, వేరే సినిమా చేయకుండా 'గబ్బర్‌సింగ్‌ 2'నే నమ్ముకున్న సంపత్‌ పరిస్థితి ఏంటంటూ సానుభూతి కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రచారకర్తలు. దీనిపై ఖండన రావటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X