డిసెంబర్లో గబ్బర్‌సింగ్-2, హీరోయిన్ ఈవిడే (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటించబోయే ‘గబ్బర్ సింగ్-2' చిత్రం అసలు మొదలు అవుతుందా? లేదా? అనే అయోమయానికి తెర పడింది. సినిమా యూనిట్ నుండి అఫీషియల్ ప్రకటన వెలువడింది. డిసెంబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కథ స్వయంగా పవన్ కళ్యాణే స్టోరీ, స్క్రిప్టు సిద్ధం చేయడం విశేషం. మరో వైపు ఈచిత్రానికి హీరోయిన్ కూడా ఖరారైంది. అనిషా ఆంబ్రోస్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.....
వాస్తవానికి ‘గబ్బర్ సింగ్-2' చిత్రాన్ని తొలుత సంపత్ నంది దర్శకత్వంలో అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇష్యూస్, ఇరత కారణాల వల్ల సినిమా లేటయింది. దీంతో సంపత్ నంది సొంతగా ఓ సినిమా నిర్మించడంతో పాటు మరో సినిమాకు దర్శకత్వం చేయడానికి రెడీ అయ్యారు.

గబ్బర్ సింగ్ 2 చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు స్లైడ్ షోలో...

దర్శకుడు, హీరోయిన్ ఖరారు

దర్శకుడు, హీరోయిన్ ఖరారు


ప్రస్తుతం ఈ చిత్రానికి కె.ఎస్. రవీంద్ర(బాబీ) దర్శకుడుగా ఖరారయ్యాడు. ఇంతకుముందు కెఎస్ రవీంద్ర ‘పవర్' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అలియాస్ జానకి చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయింది.

పవన్ కళ్యాణ్ సొంత స్టోరీ

పవన్ కళ్యాణ్ సొంత స్టోరీ


గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. దీంతో పాటు ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.

గబ్బర్ సింగ్ -2

గబ్బర్ సింగ్ -2


గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది.

టాప్ టెక్నీషియన్స్

టాప్ టెక్నీషియన్స్


ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి, సినిమాటోగ్రాఫర్ జైనన్ విన్సెంట్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, కాస్టూమ్ డిజైన్ రాజేష్ ఈచిత్రానికి పని చేయబోతున్నారు. డిసెంబర్లో షూటింగ్ మొదలు పెట్టి మే 2015 నాటికి విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తానికి ‘గబ్బర్ సింగ్-2' చిత్రంపై అఫీషియల్ ప్రకటన వెలువడటంతో అయోమయానికి తెర పడినట్లయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X