‘గబ్బర్ సింగ్-2’ ఫస్ట్ షెడ్యూల్ వివరాలు...
హైదరాబాద్: చాలా కాలంగా నానుతూవస్తున్న పవన్ కళ్యాణ్ నటించబోయే ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. అలియాస్ జానకి చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గోపాల గోపాల' చిత్రం షూటింగ్ పూర్తవడంతో ఆయన ‘గబ్బర్ సింగ్-2' చిత్రంపై దృష్టి సారించారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. జనవరిలో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేసారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందట. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ వివరాలు వెల్లడికానున్నాయి.

'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.
గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది.


Click it and Unblock the Notifications











