‘గబ్బర్ సింగ్-2’ ఇదిగో సాక్ష్యం, సెట్లో డైరెక్టర్ (ఫోటో)
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ఎట్టకేలకు ప్రారంభమైంది. శుక్రవారం(మే 29) మహారాష్ట్రలోని మల్షెజ్ ఘాట్స్ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించారు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ) ట్విట్టర్లో ట్వీట్ చేసారు.
‘నేను కూడా ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. గబ్బర్ సింగ్-2 మొదలైంది. నాజీవితంలో మరిచిపోలేని రోజు. మన పవర్ స్టార్ కు థాంక్స్' అంటూ ట్వీట్ చేసారు.
నిర్మాత శరత్ మరార్ ఈ విషయం గురించి స్పందిస్తూ..‘గబ్బర్ సింగ్-2 చిత్రం ఈ రోజు మార్నింగ్ ఎంతో గొప్పగా ప్రారంభం అయింది. టీం మెంబర్స్ అంతా ఎంతో ఎగ్జైటింగుగా ఉన్నారు. మల్షెజ్ ఘాట్లో తుపాకులు, గుర్రాలు. పవర్ స్టార్ త్వరలో షూటింగులో జాయిన్ అవుతారు' అని వెల్లడించారు.
అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈచిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

గబ్బర్ సింగ్ 2 లో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందిట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.
గత కొద్ది రోజులుగా ఈ చిత్ర దర్శకుడు బాబీ, సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ కలిసి ఈ సినిమా కోసం మహారాష్ట్రలో లొకేషన్స్ ని వెతికారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ జూన్ 5తో ముగియనుందని టాక్. ఈ షెడ్యూల్ తర్వాత... మిగిలిన లాంగ్ షెడ్యూల్స్ ని ఈ చిత్ర టీం ప్లాన్ చేసుకోనుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనీష అంబ్రోసేని ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











