200 రోజులు పూర్తి చేసుకున్న ‘గబ్బర్ సింగ్’!

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం 200 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రం 5 సెంటర్లలో రెండు వందల రోజులు పూర్తి చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే నిర్మాతలు మాత్రం ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.

గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీలో సూపర్ హిట్ అయిన 'దబాంగ్' చిత్రానికి ఇది రీమేక్. 2012లో ఈచిత్రం బిగ్గెస్ హిట్ చిత్రంగా నిలవడమే కాదు....టాలీవుడ్ చరిత్రలో పలు సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

Gabbar Singh

గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్ రూపొందబోతోందనే ప్రచారం ఇటీవల జరిగినా....ఇప్పటి వరకు అలాంటి ఆలోచన ఏమీ లేదని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవలే ప్రకటించారు. నేను గానీ, నిర్మాత బండ్ల గణేష్ గానీ ఎప్పుడూ గబ్బర్ సింగ్-2 గురించి మాట్లాడుకోలేదు. ఏదైనా పవర్ స్టారే డిసైడ్ చేస్తారు' అంటూ ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో 'సరదా'(తాత్కాలిక టైటిల్) చేయడానికి రెడీ వుతున్నారు. ఈచిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం ఫిల్మ్ నగర్లోని ఓ దేవాలయంలో ఇటీవల జరిగింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో పవన్ సరసన సమంత హీరోయిన్ గా ఎంపికైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X