గబ్బర్‌సింగ్ ఆడియో విడుదల ఆరోజేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'గబ్బర్‌సింగ్' ఆడియో ఏర్పిల్లో విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈచిత్రం ఆడియో తేదీ ఖరారైనట్లు సమాచారం. నిర్మాత బండ్ల గణేష్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఏర్పిల్ 15న ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రం ఆడియో ఒకే సారి మూడు నగరాల్లో గ్రాండ్ గా నిర్వహించి చరిత్ర సృష్టిస్తారే వార్తలు వినిపిస్తున్నప్పటికీ దీనిపై కశ్చితమైన సమాచారం లేదు.
మాస్ బీట్లు వేయడంలో ఎక్స్‌పర్ట్‌గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపిక కావడంపై ఇటు అభిమానులు కూడా ఆనందంగా ఉన్నారు. పవన్-దేవిశ్రీ కాంబినేషస్లో వచ్చిన జల్సా చిత్రం ఆడియో మంచి విజయం సాధించింది. ఈనేపథ్యంలో 'గబ్బర్ సింగ్' చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి.
దర్శకుడు హరీష్ శంకర్ ఈచిత్రంలో అదరగొట్టే డైలాగులు రాశాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో...'నాకు కొంచెం తిక్క ఉంది, కానీ దానికో లెక్క ఉంది' అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగుకు మంచి రెస్పాన్ వచ్చింది. ఇలాంటి డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయని నిర్మాత బండ్ల గణేష్ చెబుతుండటం అభిమానులు మరింత ఆనందానికి గురి చేస్తోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. దబాంగ్ మున్ని మలైకా అరోరా ఈచిత్రంలోనూ ఓ ఊపు ఊపనుంది.


Click it and Unblock the Notifications











