హాట్ కేకుల్లా...‘గబ్బర్ సింగ్’ సీడీలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' ఆడియో రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. ఈచిత్రంలోని పాటలకు దేవిశ్రీ అందించిన మాస్ బీట్స్, మెలోడీ ట్యూన్స్‌కి శ్రోతల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఆడియో హాట్ కేకుల్లా మహా ఫాస్ట్‌గా అమ్ముడు పోతున్నాయి. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆడియో విడుదలైన 24 గంటల లోసే గబ్బర్ సింగ్ ఆడియో ఫస్ట్ బ్యాచ్ కేసెట్లు, సీడీలు 80 శాతం అమ్ముడయ్యాని తెలుస్తోంది.
ముఖ్యంగా ఆల్బంలోని 'కెవ్వుకేక' సాంగుకు బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాన్ డైలాగుతో మొదలయ్యే వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన 'పిల్లా' సాంగును జనాలు తెగ ఇష్ట పడుతున్నారు. కోట శ్రీనివాస్ పాడిన తాగుబోతు పాట గమ్మత్తుగా బాగుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
'ఆకాశం అమ్మాయైతే' పాటతో పాటు, 'దిల్ సే' మెలొడీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఇక బాబా సెహగల్ పాడిన గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ పవర్ స్టార్ ఇమేజ్‌కు తగిన విధంగా సూపర్ గా ఉందని, పాటలన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నామని అభిమానులు అంటున్నారు.
ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: కడలి బ్రహ్మ, ఎడిటింగ్ గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగ్నేష్ సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











