‘గబ్బర్ సింగ్’ సెన్సార్ మే 4న
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్ ' చిత్ర యూనిట్ పాటల చిత్రీకరణలో భాగంగా స్విట్జర్లాండ్ వెళ్లబోతోంది. అక్కడి అందమైన లొకేషన్లలో 'దిల్ సే' పాటతో పాటు మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. మే 2వ తేదీకల్లా గబ్బర్ సింగ్ చిత్రం ప్రోస్టు ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి చేసుకోనుంది.
మే 4వ తేదీ నాటికి ఫస్ట్ కాపీ రెడీ అయి అదే రోజు సెన్సార్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మే 2వ వారంలో అంటే మే 9న లేదా 11వ తేదీన చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. నిర్మాతలు అధికారికంగా విడుదల తేదీ ప్రకటించనున్నారు. గబ్బర్ సింగ్ ఆడియో ఇటీవల విడుదలైన మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఆడియో గురించి దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్లో ప్రస్తావిస్తూ...''అడిక్టెడ్ లైక్ విస్కీ...కనెక్టెడ్ లైక్ 3జి..రిపీటింగ్ లైక్ ఎర్త్...ఎంజాయ్ లైక్ మ్యాడ్...దిస్ ఈజ్ ఆల్ ఎబౌట్ గబ్బర్ సింగ్ ఆడియో...థాంక్స్'' అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.


Click it and Unblock the Notifications











