విజయవాడ నేషనల్ హైవేపై పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ ,విజయవాడ నేషనల్ హైవే మీద జరుగుతోంది. అక్కడ కార్ ఛేజ్ సీన్స్ తో కూడిన క్లైమాక్స్ ఫైట్ ని చిత్రీకరిస్తున్నారు. స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఈ హై వోల్టేజి ఫైట్ షూట్ చేస్తున్నారు. సినిమాలో ఈ క్లైమాక్స్ హైలెట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ కాస్త తిక్క ఉన్న పోలీస్ గా కనిపిస్తారు. దాదాపు 18,00 ధియోటర్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్,ట్రైలర్స్ విపరీతమైన క్రేజ్ ని సినిమాపై తీసుకువచ్చాయి. సల్మాన్ ఖాన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన దబాంగ్ రీమేక్ ఇది. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో పంచ్ డైలాగులు అదిరిపోతాయని నిర్మాత బండ్ల గణేష్ హామీ ఇస్తున్నాడు. పవన్ సైతం ఈ చిత్రం పై మంచి ఆశలే పెట్టుకున్నాడు. పంజా చిత్రం పెద్ద పెయిల్యూర్ కావటంతో ఈ చిత్రం మాస్ కి నచ్చేలా ప్లాన్ చేసి రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











