twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ కన్నీళ్లు పెట్టుకొన్నారు.. వాడిని మేమే ఉరితీస్తాం.. గబ్బర్ సింగ్ గ్యాంగ్ సెన్సేషన్ కామెంట్స్

    |

    హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిత్ర అనే ఆరేళ్ల అమ్మాయిపై జరిగిన లైంగికదాడి, హత్య కేసు ఘటనపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. నిందితుడు రాజు చేసిన దారుణంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు మనోజ్ మంచుతోపాటు గబ్బర్ సింగ్ చిత్రంలోని కమెడియన్లు ఘాటుగా స్పందించారు. చిత్ర కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు చెప్పిన విషయాలు ఏమిటంటే..

    మగజాతి తలదించుకొనేలా

    మగజాతి తలదించుకొనేలా

    ఆరేళ్ల పాప చిత్రపై జరిగిన దారుణం తెలిసి చాలా బాధపడ్డాం. ఈ ఘటన మగజాతి తలదించుకొనేలా చేసింది. నిందితుడు రాక్షసంగా ప్రవర్తించాడు. ఇలాంటి సంఘటనలు ఆపాలంటే దుబాయ్‌లో అమలు చేస్తున్న శిక్షలను తెలంగాణా రాష్ట్రంలో, అలాగే హైదరాబాద్‌లో కూడా అమలు చేయాలి. అప్పుడే ఇలాంటి నేరాలకు పాల్పడేవాళ్లకు భయం కలుగుతుంది. మరో మగాడు కూడా ఇలాంటి పని చేయకుండా శిక్ష విధించాలి. వాడికి అక్కా చెల్లెల్లు లేరా అని గబ్బర్ సింగ్ కమెడియన్ అన్నారు.

    మనోజ్ అండగా నిలవడంతో

    మనోజ్ అండగా నిలవడంతో

    చిత్ర కుటుంబానికి మనోజ్ మంచు అండగా ఉండటం నిజంగా అభినందించాలి. సినీ పరిశ్రమలోని ప్రతీ ప్రముఖుడు చిత్ర కుటుంబానికి అండగా ఉంటారు. మనోజ్ తన తాత చనిపోయానా ఏడ్వలేదు. కానీ చిత్ర ఘటన తెలిసిన తర్వాత మనోజ్ కంటతడి పెట్టుకొన్నారు. చిత్ర ఘటనను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాం. అప్పటికే ఆయన ఈ ఘటనను తెలుసుకొని చలించిపోయారు. ఈ ఘటన గురించి మీడియాలో వస్తున్న న్యూస్‌ను ఫాలో అవుతున్నారు. మేము స్వయంగా కలిసి పవన్ కల్యాణ్ చెబితే ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు అని గబ్బర్ సింగ్ గ్యాంగ్ వెల్లడించింది.

    పవన్ కల్యాన్ కంటతడి పెట్టుకొని

    పవన్ కల్యాన్ కంటతడి పెట్టుకొని

    చిత్ర దారుణ సంఘటనను చెప్పగానే పవన్ కల్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యారు. వెంటనే కళ్ల నిండా నీళ్లు తీసుకొన్నారు. రెండు మూడు నిమిషాల పాటు కంటతడి పెట్టి పెట్టారు. ఆయన చూసి మాకు దు:ఖం వేసింది. ఆయన స్వయంగా వచ్చి చిత్ర కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా వారికి అండగా ఉంటామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగకూడదనే ఆయన వకీల్ సాబ్ లాంటి సినిమాలు తీశారు. అయినా ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారని గబ్బర్ సింగ్ కమెడియన్ అన్నారు.

    ఇలాంటి సంఘటనలు చేస్తే నిజంగా రౌడీలుగానే..

    ఇలాంటి సంఘటనలు చేస్తే నిజంగా రౌడీలుగానే..

    బతుకు తెరువు కోసం తాము సినిమాల్లో రౌడీ వేషాలు వేస్తాం. రౌడీలుగా ఇలా వేషంలో కనిపిస్తాం. కానీ మాకు మనసు ఉంది. మేము మనుషులమే. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మేము నిజంగా రౌడీలమవ్వాలని అనిపిస్తుంది. ప్రభుత్వం మాకు అధికారం ఇస్తే మేమే వాడిని ఉరితీస్తాం. మేము జైలుకు పోయినా సరే ఫర్వాలేదు. కానీ నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని గబ్బర్ సింగ్ కమెడియన్లు డిమాండ్ చేశారు.

    మాకు అప్పగిస్తే మేమే శిక్షిస్తాం అంటూ...

    మాకు అప్పగిస్తే మేమే శిక్షిస్తాం అంటూ...

    చిత్ర హంతకుడిని వెంటనే తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు పట్టుకోవాలి. నిందితుడికి కఠిన శిక్ష విధించాలి. దిశ కేసులో ఎన్‌కౌంటర్ చేయాలి. ఆడుకోనే పిల్లపై అలాంటి దారుణానికి పాల్పడిన అతడిని మాకు అప్పగించినా మేము శిక్షిస్తాం. ఈ విషయంలో ఎక్కువ రోజులు వేచి చూడకూడదు. వెంటనే శిక్షను అమలు చేయాలని గబ్బర్ సింగ్ టీమ్ ప్రభుత్వాన్ని కోరింది.

    English summary
    Gabbar Singh comedians Team sensational comments on Chitra Case. They Said, Pawan Kalyan cried after knowing this incident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X