'గబ్బర్ సింగ్'లో మిస్సైన డైలాగులు... తొలిగించిన సీన్స్
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో సెన్సార్ వారు కొన్ని సీన్స్ డిలేట్ చేసారు. అలాగే కొన్ని డైలాగులును తొలిగించారు. వాటిని దర్శకుడు హరీష్ శంకర్..తన ఫేస్ బుక్ ఎక్కౌంట్ లో ఉంచారు. అవేమిటంటే...
మిస్సైన డైలాగులు...
1. లైఫ్ లో రెండు విషయాల్లో జాగ్రత్త గా ఉండాలి..ఒకటి నాతో మాట్లాడేటప్పుడు..రెండు నాతో పోట్లాడేటప్పుడు.
2. విలన్ : నువ్వు సింహం తో పెట్టుకున్నావని గుర్తుంచుకో...
3. గబ్బర్ సింగ్: నీలాంటి సింహాలు జింకల దగ్గరో,కుక్కల దగ్గరో ప్రతాపం చూపించాలి గనీ..నా లాంటి వేటగాడు ఎదురు వచ్చనప్పుడు వళ్లు దగ్గర పెట్టుకోవాలి.
తొలిగించిన విజువల్స్ ...
1.గూండాలతో కబ్బడి ఆడేటప్పుడు ..వారిని బెల్ట్ తో కొడుతుప్పుడు అశోక్ చక్రం ఎంబ్లం ని బ్లర్ చేసారు.
2. కసై అనే పదం తొలిగించారు.
3. మందు బాబులం పాటలో ...పోలీస్ సింబల్,అశోక్ ఎంబ్లం,అబ్దుల్ కలాం ఫోటో విజువల్స్ బ్లర్ చెయ్యమన్నారు.
4. క్లైమాక్స్ లో విలన్ చెప్పే ...దీనిమ్మ తల్లి కూడా తేడానా అనే డైలాగు తొలిగించారు.
5. గాయిత్రి చెప్పే..ఆకు ఎండిపోవటం కన్నా చిరిగిపోవటం బెటర్ ..అనే డైలాగుని..ఆకు ఎండిపోవటం కన్నా ఏదో అయిపోవటం బెటర్ అనే డైలాగుతో మార్చమన్నారు.
6. కబడ్డి సీన్ లో అలీ చెప్పే నీ అయ్యి డైలాగుని తీసేసారు.
7. మీరు గీకాలే కానీ రేషన్ కార్డు అయినా తీసుకుంటాం అనే డైలాగుల ..గీకాలే కానీ అనే పదం తొలిగించారు.
8. గాయిత్రితో పవన్ కళ్యాణ్ ...తగులుకుంటారు అని చెప్పే పదాన్ని తొలిగించారు.
9. జాకెట్ నుంచి మొబైల్ తీసే విజువల్ ని తొలిగించారు. అలాగే హస్త ప్రధాన శాల వద్ద మీకు చూపిస్తే చాలా...ఇన్ కమింగ్ ఫ్రీ డైలాగులు తీసేసారు.
10. కెవ్వు కేక పాటలో మలైకా అరోరా క్లోజప్ క్లవరేజ్ ఎక్సపోజర్ బ్లర్ చేసేసారు.


Click it and Unblock the Notifications











