సీక్వెల్ ఆలోచనలో గబ్బర్ సింగ్ దర్శకుడు
మిరపకాయ్ చిత్రానికి సీక్వెల్ నిర్మించే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు హరీష్ శంకర్. 'మిరపకాయ్2' పేరుతో రూపొందబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు వర్కు పూర్తయింది. ఇటీవలనే రవితేజను కలిసి స్టోరీ, స్క్రిప్టులైన్ వినిపించినట్లు సమాచారం. గర్బర్ సింగ్ షూటింగ్ పూర్తయిన వెంటనే మిరపకాయ్2 చిత్రాన్ని ఆరంభించే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు. మిరపకాయ్ చిత్రంలో నటించిన...రీచా గంగోపాధ్యాయ్, దీక్షసేథ్ లను కాకుండా ఈ సీక్వెల్‌కు వేరే హీరోయిన్లను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ తో పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం రవితేజ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న'నిప్పు' చిత్రం షూటింగులో బిజీగా ఉన్నాడు. వైవిఎస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలయ్యే అవకాశం ఉంది.ఇక హారిష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'గబ్బర్ సింగ్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హిందీలో రూపొంది ఘన విజయం సాధించిన దబాంగ్ చిత్రానికి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications