గబ్బర్‌సింగ్, ఈగ రూపాల్లో గణేషుడు..(ఫోటోలు)
హైదరాబాద్ : జై జై గణేషా...జై కొడతా గణేషా అంటూ ఊరు వాడ మారు మ్రోగిపోతోంది. ఉండ్రాలయ్యా దండలయ్యా అంటూ భక్తులు బొజ్జ గణపయ్య నవరాత్రోత్సవాల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతున్నారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు వాడ వాడలా కొలువు తీరడంతో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే.

కాగా...కొన్ని చోట్ల వైరీటీ లంబోదరుడి రూపాలు భక్తులకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భక్తులు తమ కిష్టమైన రీతిలో వినాయకుడి ప్రతిమలు తయారు చేయించారు. గతంలో స్పైడర్ మేన్ గణపతిని చూసాం, శంకర్ దాదా ఎంబీబీఎస్ గణపతిని చూసాం. గతేడాది గబ్బర్ సింగ్, ఈగ వినాయకుడు కూడా చూసాం.
ఈ సారి క్రికెటర్ల రూపంలో ఉన్న వినాయకులతో పాటు, గబ్బర్ సింగ్, ఈగ రూపాల్లో ఉన్న వినాయకుడు కూడా కొలువు దీరాడు. పవన్ కళ్యాణ్ అభిమానుంలంతా గబ్బర్ సింగ్ గణపతిని చూసేందుకు తరలి వస్తుండగా....ఈగ రూపంలో ఉన్న వినాయకుడు కూడా భక్తులను ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











