తెలుగు ఆడియెన్స్ టేస్ట్ కి తగ్గట్టే పవన్ ఒరిజినల్ సినిమా...!
దబాంగ్ సినిమాని గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తుండడంపై ఎక్కువ మంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో చాలా కాలం తర్వాత ఒక మాస్ మసాలా సినిమా రావడంతో దబాంగ్ అంత హిట్టయిందని, నిజానికి అందులో అంత విషయం లేదని, తెలుగులో ఇలాంటి సినిమాలు తరచుగా వస్తూనే ఉంటాయని విశ్లేషకులు సైతం అంటున్నారు.
కానీ పవన్ మాత్రం ఏరికోరి దబాంగ్ రీమేక్ ని ఎంచుకుని హారీష్ శంకర్ చేతుల్లో పెట్టాడు. అయితే ఇందులో రొటీన్ అనిపించే అంశాలని మార్చే పనిలో హరీష్ బిజీగా ఉన్నాడు. సాధారణంగా రీమేక్స్ విషయంలో ఒరిజినల్ ని మార్చేందుకు సాహసించరు. కానీ ఈ చిత్రానికి మాత్రం చాలా మార్పులు చేర్పులు చేస్తున్నామని, ఇది ఒరిజినల్ పవన్ కళ్యాణ్ సినిమాలా, పవన్ ఫ్యాన్స్ టేస్ట్ కి తగ్గట్టు ఉంటుందని హరీష్ శంకర్ చెప్పాడు.
ఇదిలావుంటే జూలైలో సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. దసరాకి పవన్ 'షాడో" విడుదలవుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











