గబ్బర్‌‌సింగ్ గణేష్‌కు అరుదైన గౌరవం.. దాసరి ఆశీస్సులకు ప్రతిఫలం..

By Rajababu

Recommended Video

గబ్బర్‌‌సింగ్ గణేష్‌ ఛాన్స్ కొట్టాడు !

గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ కంపోజ్ చేయడం ద్వారా కొరియోగ్రాఫర్ గణేష్ కాస్త.. గబ్బర్ సింగ్ గణేష్ అయ్యాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా నృత్యాలు సమకూర్చడంలో గణేష్‌ది ప్రత్యేకమైన స్టయిల్. కేవలం పవన్‌కే కాదు.. టాలీవుడ్‌లో అగ్ర నటుల సూపర్ హిట్ పాటలకు గణేష్ కొరియోగ్రఫీ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు సేవ చేస్తున్న గణేష్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది.. ఆ వివరాలు మీకోసం..

 ఒసేయ్ రాములమ్మా' చిత్రం ద్వారా

ఒసేయ్ రాములమ్మా' చిత్రం ద్వారా

ప్రముఖ దర్శకులు, దివంగత దాసరి నారాయణరావు ఆశీస్సులు, ప్రోద్బలంతో ‘ఒసేయ్ రాములమ్మా' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు గణేష్ కొరియోగ్రాఫర్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సుకుమార్, త్రివిక్రమ్, హరీష్ శంకర్, గుణశేఖర్, వివి వినాయక్, పూరి జగన్నాథ్, కరుణాకరన్, నాగేశ్వరరెడ్డి, సీనియర్ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకుల దగ్గర పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.

 పవన్, జూనియర్ ఎన్టీఆర్‌తో

పవన్, జూనియర్ ఎన్టీఆర్‌తో

ఢీ-2 టెలివిజన్ డాన్స్ షో విన్నర్, మా టీవీ అవార్డ్ గ్రహీత, భారత్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా బెస్ట్ టాలెంటెడ్ అవార్డును ‘గబ్బర్‌సింగ్' గణేష్ మాస్టర్ గతంలో అందుకొన్నారు. సినీ కొరియోగ్రాఫర్‌గా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్, నితిన్, మంచు విష్ణు, అల్లరి నరేష్, నారా రోహిత్, నిఖిల్, ఆది, వరుణ్ సందేశ్, జగపతి బాబు, కళ్యాణ్ రామ్ తదితర హీరోలతో పనిచేశారు.

 మాజీ గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా

మాజీ గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా

తాజాగా భారత్ వరల్డ్ రికార్డ్స్ ప్రతీ ఏడాది అందించే బెస్ట్ టాలెంటెడ్ అవార్డును 2016-2017కు గాను ప్రముఖ కొరియోగ్రాఫర్ ''గబ్బర్ సింగ్'' గణేష్ మాస్టర్‌ అందుకున్నారు. సినీ మరియు టీవీ రంగాలలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రం తరపున గణేష్ మాస్టర్‌కు బెస్ట్ టాలెంటెడ్ అవార్డును మాజీ ముఖ్యమంత్రి , తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య, భారత్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా ప్రతినిధి లయన్ డా.కె వి రమణారావులు నమోదు పత్రాన్నిఅందజేశారు.

 సంతోషంగా ఉంది.. గుర్తింపు లభించింది..

సంతోషంగా ఉంది.. గుర్తింపు లభించింది..

అవార్డు అందుకొన్న సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. తనకు రావడం చాలా ఆనందంగా ఉంది. తన సేవలకు సరైన గుర్తింపు లభించింది. ఈ స్ఫూర్తితో మరింత మెరుగైన నృత్యాలను సమకూరుస్తాను అని గణేష్ మాస్టర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X