సెన్సార్ రిపోర్టు: గబ్బర్ సింగ్‌కు U/A సర్టిఫికెట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ చిత్రం ఈ రోజు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో 12 సంవత్సరాల పిల్లలు కూడా చూడదగిన సినిమాలకు U/A సర్టిఫికెట్ అని అర్థం. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీకి ముందు పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈచిత్రంలోని పోలీస్ యూనిఫాంను కించ పరిచే విధంగా సీన్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని పోలీసుల అధికారుల సంఘం వారు సెన్సార్ బోర్డు ఆఫీసర్ ధనలక్ష్మిని కోరారు. ఈ రోజు ఉదయం సినిమా డిజిటల్ కాపీనీని వీక్షించిన బోర్డు సభ్యులు సినిమాలో పోలీసులను కించపరిచే విధంగా సీన్లు ఏమీ లేవనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది.
పోలీసు అధికారుల సంఘం ఆందోళన నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ హుటాహుటిన సెన్సార్ బోర్డు కార్యాలయానికి చేరుకుని....సెన్సార్ బోర్డు సభ్యులతో చర్చించారు. మొత్తానికి సినిమా విడుదలపై అడ్డంకులు అన్నీ తొలగి పోవడంతో నిర్మాత ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 11న గబ్బర్ సింగ్ చిత్రం గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











