‘గబ్బర్ సింగ్’ హెక్సా ప్లాటినం డిస్క్ షీల్డ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే ఆడియో కూడా కెవ్వు కేక పెట్టించింది. ఈ నేపథ్యంలో త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించనున్నారు. సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్ అంతా హాజరు కానున్నారు.
'గబ్బర్ సింగ్' విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని షీల్డ్‌తో సత్కరించనున్నారు. ఈ మేరకు ప్రత్యేకగా షీల్డ్ డిజైన్ చేయించారు. మీరు ఫోటోలో చూస్తున్న షీల్డ్ అదే. త్వరలోనే ఈ వేడుకకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు. మే 31వ తేదీన జరుపుతున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించినా...ఎందుకనో నిర్వహించలేదు.
ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. సాధారణంగా తన సినిమా విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమోషన్లలో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. గబ్బర్ సింగ్ ప్రమెషన్ విషయంలోనూ పవర్ స్టార్ దూరంగానే ఉన్నారు. దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ శృతి హాసన్ స్టూడియోల చుట్టూ తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు.
తాజాగా హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుకకు కూడా పవన్ దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నా....నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్‌ని కన్విన్స్ చేశాడని సమాచారం. పవర్ స్టార్ వస్తాడని తెలియడంతో ఆ వేడుక ఎప్పుడు జరుగుతుందా...తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











