400 కెమెరాలతో పవన్ ఎంట్రీ సీన్!

By Bojja Kumar

పవన్ కళ్యాన్ హీరోగా రాబోతున్న 'గబ్బర్ సింగ్" సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా....హారిష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు. సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇందులో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ భారీగా రూపొందించారని తెలిసింది. ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఈ సీన్ చిత్రీకరణకు ఏకంగా 400 కెమెరాలను ఉపయోగించారట. మరి ఆ సీన్ ఎంత భారీగా ఉంటుందో సినిమా విడుదలైతేగానీ తెలీదు.

ఈ సినిమాలో ఇంకా సుహాసిని, అజయ్, అభిమన్యు సింగ్, నాగినీడు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ ను తమిళనాడులోని పొల్లాచ్చిలో చిత్రీకరించేందుకు ఏర్పాటు చేశారు. ఇక్కడ పవణ్, శృతి హాసన్ లపై కొన్ని కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన హిందీ దబాంగ్ సినిమాకు ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X