‘జులాయి’ ఆడియోలో గబ్బర్ సింగ్?
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం 'జులాయి'. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియాన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నెల 25న ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరువుతున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి, పవన్ కళ్యాణ్‌కి మధ్య మంచి రిలేషన్ ఉంది. పైగా అల్లు అర్జున్ తమ ఫ్యామిలీకే చెందిన వాడు కావడంతో.....త్రివిక్రమ్ ఆహ్వానం మేరకు పవన్ రావడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావడం ద్వారా తన తాజా సినిమా 'గబ్బర్ సింగ్'కు పబ్లిసిటీ కూడా దక్కనుంది. అయితే పవన్ రాక విషయం ఇంకా అధికారికంగా కన్‌ఫర్మ్ కావాల్సి ఉంది.
''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం.
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బేనర్‌పై డివివి దానయ్య సమర్పణలో...ఎన్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, ఇలియానా, డా. రాజేంద్రప్రసాద్, సోనూసూద్, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎంఎస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. జూన్ 14న ఈ చిత్రం విడుదల చేసే యోచనలో ఉన్నారు నిర్మాతలు.


Click it and Unblock the Notifications











