'గబ్బర్ సింగ్' జీపు ని గిప్ట్ గా ఇచ్చారు
వరంగల్: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చి విజయవంతం అయిన చిత్రం 'గబ్బర్ సింగ్'. ఈ సినిమాలో పవన్ వాడిన మిలటరీ జీపు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ జీపు ఓరుగల్లు రోడ్లపై పరుగెత్తనుంది. గబ్బర్ సింగ్ చిత్రనిర్మాత బండ్ల గణేష్ ఆ జీపును తెలంగాణ తెదేపా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు బహుకరించారు.
ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వరంగల్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్‌గా, నెక్‌జోనల్ ఛైర్మన్‌గాను పనిచేస్తున్నారు. బండ్ల గణేష్ సినీ నిర్మాత కాక మునుపు పౌల్ట్రీ రంగంలో ఉన్నారు. అప్పటి నుంచే నిర్మాత గణేష్, ప్రదీప్‌రావు మంచి స్నేహితులు. ఆ సాన్నిహిత్యంతోనే తనకు జీపును బహుకరించారని ఎర్రబెల్లి ప్రదీప్‌రావు మీడియాకు వివరించారు. ఈ జీపు మంగళవారం ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఇంటికి చేరడంతో దానిని చూసేందుకు పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కుటుంబసభ్యులు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు మాట్లాడుతూ.. తాను 2009 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు పవన్‌కళ్యాణ్ ప్రచారానికి వచ్చారని, అప్పుడు పార్టీ అభ్యర్థిగానే కాకుండా ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండటం వల్ల ఈ జీపును తనకు బహుమతిగా ఇచ్చారని ఆనందంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం నగరంలో ఈ జీపును కొంతకాలం తిప్పుతానని ఆయన ప్రకటించారు. మొత్తంమీద గబ్బర్‌సింగ్ వాహనం జిల్లాకు చేరడంతో పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా ప్రదీప్‌రావు అనుచరులు సైతం ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
మరో ప్రక్క 'గబ్బర్ సింగ్' కి సీక్వెల్ ని చేయటానికి నిర్మాత గణేష్ బాబు ఫిక్సైపోయారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ సీక్వెల్ వచ్చే అవకాసం ఉందా అని చాలా మందికి సందేహాలు కలిగాయి. అయితే ఇప్పుడు గణేష్...'గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్' టైటిల్ ని రిజిస్టర్ చేయబోతున్నారు. దాంతో ఖచ్చితంగా సీక్వెల్ వస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే హరీష్ శంకరే దర్శకుడా మరొకరు ఉంటారా అనేది మాత్రం తెలియలేదు. శ్రీను వైట్లకు ఈ చిత్రం ఇచ్చే అవకాసం ఉందని వినికిడి.


Click it and Unblock the Notifications











