పవన్ 'గబ్బర్ సింగ్' లేటెస్ట్ ఇన్ఫో
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతన్న చిత్రం 'గబ్బర్ సింగ్'. ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా..పొలాచ్చి లో పూర్తి చేసుకు వచ్చింది. అక్కడ హీరో,హీరోయిన్స్ పై ఓ పాటను షూట్ చేసుకుని వచ్చారు. జనవరి 2 నుంచి హైదరాబాద్‌లో కొన్ని కీలక ఘట్టాలు తెరకెక్కిస్తారు. ఈ చిత్రంలో పవన్ తల్లిగా సుహాసిని నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై నిర్మాత బండ్ల గణేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు..ఆయన చెపుతూ..''పవన్ కల్యాణ్ అభిమానులకే కాదు.. అన్ని వర్గాలకూ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాం. వినోదం, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉంటాయ''అన్నారు.
ఇక ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. బాలీవుడ్‌లో విజయవంతమైన 'దబాంగ్' చిత్రాన్ని ఆధారంగా తీసుకొన్నా... పవన్‌కి అనుగుణంగా స్క్రిప్టులో చాలా మార్పులు చేశారని యూనిట్ వర్గాలు చెప్తున్నారు. అలాగే 'పంజా'లో స్త్టెలిష్‌గా కనిపించిన పవన్ కల్యాణ్ ఈసారి తన పాత శైలిలోకి వెళ్లిపోయి అలరిస్తారని చెప్పుకుంటున్నారు. సినిమా చాలా వినోదాత్మకంగా సాగుతుందని,హిందీ కన్నా పెద్ద హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. . యాభై రోజుల షెడ్యూల్ లో మాగ్జిమం టాకీ పార్ట్ అవకొట్టాలని నిర్ణయించుకున్నారు.
ఇక ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ నటిని ఒప్పించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ రెండు పాటల రికార్టింగ్ పూర్తి చేసారు. ఇక దబాంగ్ రీమేక్ గా రూపొందుతోన్న గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మాత గణేష్ బాబు..ఎట్టి పరిస్దితుల్లోనూ అనుకున్న తేదీకే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్, సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 28వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











