'గబ్బర్ సింగ్'లైవ్ అప్ డేట్స్(స్పెషల్)
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ ఈ రోజు భారీ ఎత్తున విడుదల అవుతోంది. అయితే కొన్ని చోట్ల ప్రీమియర్ షో లు పడ్డాయి. వీటిని చూసిన ఓ అభిమాని...పంపిన లైవ్ అప్ డేట్స్...
గబ్బర్ సింగ్ సినిమా ప్రారంభం స్పెషల్ ధాంక్స్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్,శ్యామ్ ప్రసాద్ రెడ్డి,రమేష్ సిప్పీ లకు అంటూ పడుతూ ప్రారంభమవుతుంది.
టైటిల్స్ అన్నీ గన్స్ బ్యాగ్ గ్రౌండ్స్ వస్తూంటాయి
పూరి కొడుకు ఆకాష్ ..షోలే లో గబ్బర్ సింగ్ సినిమాని చూస్తూంటాడు. సుహాసిని, నాగినీడు వాడి పేరెంట్స్ గా కనపడుతారు
పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్..రౌడీలను గుర్రం పై ఛేజ్ చేస్తూ వస్తుంది.
గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్. పవన్ అదిరిపోయేలా డాన్స్ చేసాడు.
అభిమన్యు సింగ్ ..కొండవీడు విలేజ్ లో విలన్ గా ఎంట్రీ.
అలీ ...కానిస్టేబుల్ సాంబ గా పరిచయం
పది మంది కోసం మంచి చేద్దాం అనుకునే వాడన్ని,పది కాలాలు బ్రతకాలని దీవించు అమ్మా...పవన్ కళ్యాణ్ తన తల్లి సుహాసిని అంటాడు.
నాకు నేనే పోటీ...నాతో నాకే పోటీ..నాతో ఎవరు పోటీకి రారు,రాలేదు. పవన్ డైలాగు
శృతిహాసన్..బాగ్యలక్ష్మి అనే విలేజ్ గర్ల్ గా ఎంట్రి. పవన్,శృతి మధ్యన కామిడీ
ఆకాశం అమ్మాయైతే సాంగ్ వస్తుంది.
బ్యాంక్ రికవరి ఆఫీసర్ ...రికవరి రంజిత్ కుమార్ గా బ్రహ్మానందం ఎంట్రీ.
ఈ పేటకు నేనే మేస్త్రి పాటతో పవన్ రిక్షాలో వచ్చే సీన్ హైలెట్
పవన్..రౌడీలతో కలిసి కబడ్డి ఆడే సీన్...చాలా ఎంటర్టనింగ్ గా ఉంటుంది.
కోట శ్రీనివాసరావు..హీరోయిన్ త్రాగుబోతు తండ్రి. మందుబాబులం పాట..పవన్ మాస్ స్టెప్స్ ఇరగతీసాయి.
పిల్ల పాట వెంటనే స్విజ్జర్ లాండ్ లో వస్తుంది.
పవన్ పంచ్ డైలాగులతో పెద్ద ఫైట్
ఇంటర్వెల్
జయప్రకాష్ రెడ్డి తన ట్రేడ్ మార్క్ కామెడీతో ఎంట్రీ...ధియోటర్లో నవ్వులు
పోలీస్ స్టేషన్లో పవన్ అంత్యాక్షరి. సూపర్ గా నవ్విస్తుంది
దిల్ సే పాట..పవన్,శృతి చాలా డిఫెరెంట్ గా ఉంటారు
మలైకా పాట కెవ్వు కేక ధియోటర్ మారు మ్రోగిపోయింది.
ఎమోషన్ సీన్..తండ్రితో పవన్
క్లైమాక్స్ ఫైట్...సినిమా సూపర్ హిట్


Click it and Unblock the Notifications











