పొల్లాచ్చి బాట పడుతున్న పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'గబ్బర్ సింగ్" సినిమా షూటింగ్ త్వరలో తమిళనాడులోని పొల్లచ్చిలో షూటింగ్ జరుపుకోవడానికి సిద్ధం అవుతోంది. ఈ మేరకు అక్టోబర్ 29న గబ్బర్ సింగ్ యూనిట్ పొల్లచ్చి ప్రయాణం కానుంది. ఇక్కడ ఎంపిక చేసిన లొకేషన్లలో పవన్ కళ్యాన్-శృతిహాసన్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
మొదటి షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది. దర్శకుడు హారిష్ శంకర్ వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఈ సినిమాను పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. . సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో రూపొందిన సూపర్ హిట్ మూవీ 'దబాంగ్" రీమేక్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే...
సల్మాన్ ఖాన్ బాడీలాంగ్వేజ్ కి అనుగుణంగా రూపొందిన 'దబాంగ్" హిందీలో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే..ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి మ్యానరిజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టరైజేషన్ రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈచిత్రంలో వుంటాయని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











