పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్: హరీష్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'గబ్బర్ సింగ్" టీజర్ ఈ రోజు విడుదలై మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఆ సినిమా నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు హరీష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...''టీజర్ రిలీజ్ అయిన క్షణం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి, ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి లుక్ అదిరిందని, టీజర్ చూస్తే డెఫినెట్‌గా ఇది రికార్డులు సృష్టించే చిత్రం అవుతుందని పిస్తోందని అందరూ అభినందనలు తెలపడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన 'నాక్కొంచెం తిక్కుంది...కానీ, దానికో లెక్కుంది" డైలాగ్ సూపర్ అంటున్నారు. ఇలాంటి సూపర్ డైలాగ్స్ మా హరీష్ శంకర్ ఈ సినిమా కోసం ఎన్నో రాశారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ చెప్పే ప్రతీ డైలాగ్‌కు జనం చప్పట్లు కొడతారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే నెం.1 హిట్ గా నిలబడ్డమే కాదు, కలెక్షన్స్ లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలెల్ గా నిలుస్తుంది. ఏప్రిల్ చివరి వారంలోగానీ, మే ఫస్ట్ వీక్‌లో గానీ 'గబ్బర్ సింగ్" రిలీజ్ అవుతుంది"" అని తెలిపారు.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ..'' ఈ చిత్రం డెఫనెట్ గా అన్ని ఎక్స్‌పెక్టేసన్స్‌ని రీచ్ అవుతుంది. సల్మాన్ ఖాన్ బాడీలాంగ్వేజ్ కి అనుగుణంగా రూపొందిన 'దబాంగ్" హిందీలో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ కి, మేనరిజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టరైజేషన్ తో ఫుల్ మీల్స్ గా రాబోతున్న సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఫైట్స్ ఇంతకుముందెన్నడూ రాని విధంగా కొత్తకోణంలో నావెల్టీగా ఉంటాయని"" అన్నారు.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ...''జల్సా తర్వాత చేస్తున్న పవన్ కళ్యాన్ గారి సినిమా ఇది. ఈచిత్రంలో మ్యూజిక్ చాలా హైలెట్ అవుతుంది. ఎక్స్ ట్రార్డినరీ ట్యూన్స్ వస్తున్నాయి. ఈచిత్రం డెఫనెట్ గా మరో మ్యూజికల్ హిట్ అయ్యేలా మ్యూజిక్ వస్తుంది"" అన్నారు.


Click it and Unblock the Notifications











