పెళ్లాంపై అలిగినట్లే .. పవన్‌‌‌ను అలాగే , రెండేళ్లు రానివ్వలేదు .. స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్

మెగా ఫ్యామిలీని, మెగా హీరోలను అభిమానించేవాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఎందరో నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్‌ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఆదర్శంగా తీసుకుని టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ కోవలోకే వస్తారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. మెగాస్టార్, పవర్‌స్టార్‌లకు వీరాభిమాని అయిన ఆయన వారిపై ఈగ వాలినా సహించడు. అవతలివాడు ఎంతటి వాడైనా సరే చెడుగుడు ఆడుకుంటారు బండ్ల గణేష్. అలాంటి గణేష్‌కి పవన్ కళ్యాణ్‌‌కి మధ్య గ్యాప్ వచ్చిందట. అది ఎందుకో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

నిజానికి సాదాసీదా కమెడియన్‌గా, హీరోల ప్రక్కన అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టిన బండ్ల గణేశ్ .. తర్వాత నిర్మాతగా మారి, కోట్లాది రూపాయల బడ్జెట్‌తో స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్‌కి ఎదిగాడు . ఆయన ఎదుగుదల చూసి బడా కమెడియన్లు, స్టార్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఇండస్ట్రీలో ఏళ్లుగా ఉంటూ అవకాశాలకే తాము వెతుక్కుంటుంటే బండ్ల గణేష్ టాప్ ప్రొడ్యూసర్ కావడంపై చాలామంది కుళ్లుకున్నారు. ఆయనపై లేనిపోని దుష్ప్రచారం సైతం చేశారు.

gabbar singh producer bandla ganesh gave clarity on clashes with power star pawan kalyan here s the details

అయితే ఎంత వేగంగా టాప్ పొజిషన్‌లోకి వచ్చాడో, అంతే వేగంగా పరిశ్రమకు దూరమయ్యాడు బండ్ల గణేష్. ఇప్పుడు ఆయన బ్యానర్ నుంచి ఏ సినిమాలు రావడం లేదు. దీనికి తోడు కాంట్రవర్సీ కామెంట్స్‌తో ఎన్నో వివాదాలు . ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన ఫౌల్ట్రీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటున్న గణేష్.. పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలం గడుపుతున్నాడు. రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువ కావడంతో అటు వైపు ఓ రాయి వేశాడు చూశాడు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీకి వెళ్లి మరి కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చాడు. ఆ పార్టీ తరపున బండ్ల గణేష్ ప్రచారం సైతం చేసి పెట్టాడు. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో గణేష్ కొంతకాలం సైలెంట్ అయ్యారు. 2023 ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్‌కు మద్ధతుగా ప్రచారం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లినప్పుడు ఆయన కోసం ప్రాణాలిస్తానని స్టేజ్‌పై బోరున విలపించాడు. మళ్లీ ఓ సామాజిక వర్గం ఈవెంట్‌లో పాల్గొని స్టేజ్ దద్ధరిల్లిపోయేలా స్పీచ్ ఇచ్చాడు.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హిట్ మూవీ గబ్బర్ సింగ్‌ను 4కే వెర్షన్‌లో సెప్టెంబర్ 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించాడు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించాడు. పవన్ అంటే దేవుడిలా మెలిగే బండ్ల గణేష్‌కి ఒకానొక సమయంలో ఆయనతోనే విబేధాలు వచ్చాయట. ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ దీనిపై స్పందించారు. పవన్ కళ్యాణ్‌తో గ్యాప్ వచ్చిన మాట నిజమేనన్న ఆయన.. ఈ ఇష్యూ కారణంగా రెండేళ్లు పవర్‌స్టార్‌ను కలవలేదన్నారు.

గ్యాప్‌కి కారణం ఏంటీ అంటే తానేం చెప్పలేనని.. అమ్మానాన్న, భార్యపైనా అప్పుడప్పుడు అలుగుతాం కదా, ఇది కూడా అలాంటిదేనని బండ్ల గణేష్ చెప్పారు. పవన్ మీద కూడా అలిగానని అనుకున్నానని.. కానీ ఆయనతో అలా కుదరదు కదా.. ఓ రోజున త్రివిక్రమ్ పిలిపించి పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లి మళ్లీ కలిపారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం బండ్ల గణేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

More from Filmibeat

Read more about: pawan kalyan bandla ganesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X