twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్-‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. పవన్ నటించిన బిగ్గెస్ట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'గబ్బర్ సింగ్' మళ్లీ పెద్ద స్ర్కీన్ పై చూసే అవకాశం లభించింది. గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఈ రోజు(నవంబర్ 9) నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35mm థియేటర్లో మళ్లీ ప్రదర్శిస్తున్నారు. రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శింపబడనున్నాయి. డమరుకం విడుదలలో గంధరోగళం నేపథ్యంలోనే ఇక్కడ ఈ చిత్రాన్ని విడుదల చేసినట్లు తెలుస్తోంది.

    'గబ్బర్ సింగ్' చిత్రం 81 ఏళ్ల తెలుగుసినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో అభిమానులంతా సంబరాలు జరుపుకున్నారు. థియేటర్ల వద్ద కటౌట్స్, పవర్ స్టార్ పోస్టర్లకు పాలాభిషేకం, ర్యాలీలతో దుమ్ము రేపారు.

    గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మించారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించగా....పల్లెటూరి అమ్మాయి భాగ్యలక్ష్మి పాత్రలో పవన్ కి జోడీగా శృతి హాసన్ నటించింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పెద్ద హిట్టయింది.

    కాగా... 'జల్సా' మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో ఓ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని, ప్రస్తుతం స్క్రిప్టుకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే టైటిల్ ఖరారు చేస్తామని చెప్పిన త్రివిక్రమ్, అప్పటి వరకు టైటిల్ విషయంలో ఎలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని రిక్వెస్ట్ చేసారు. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. వరుసగా పెద్ద హీరోలు, పెద్ద దర్శకుల చిత్రాల్లో నటిస్తూ హిట్స్ కొడుతున్న సమంత ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన దాదాపుగా ఖరారైనట్లే.

    English summary
    Now many months after its full run, Pawan kalyan's Gabbar Singh is getting back into a theater, and that too at the prestigious Sudarshan 35mm at RTC Cross Roads. The film is going to be screened four times a day from today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X