దమ్ము, దూకుడును క్రాస్ చేసిన ‘గబ్బర్ సింగ్’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. ఈ మధ్య ప్రసాద్ ఐమాక్స్‌లో తొలి రోజు ఎన్ని ఎక్కువ షోలు ప్రదర్శించారనే విషయాన్ని కూడా రికార్డుగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవర్ స్టార్ తాజా సినిమా 'గబ్బర్ సింగ్' 28 షోలతో దమ్ము, దూకుడులను క్రాస్ చేసి 4వ స్థానంలో నిలిచింది.
ఈ విషయంలో మహేష్ బాబు నటించిన 'బిజినెస్ మేన్' చిత్రం తొలిరోజు 33 షోలు ప్రదర్శింపబడి తొలిస్థానంలో ఉంది. పవన్ గత సినిమా 'తీన్ మార్, పంజా' చిత్రాలు 30 షోలతో 2వ స్థానంలో ఉండగా... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' చిత్రం 29 షోలతో 3వ స్థానంలో నిలిచింది. తాజాగా గబ్బర్ సింగ్ 28 షోలతో నాలుగో స్థానాన్ని కైవశం చేసుకుంది.
దీంతో..మహేష్ బాబు నటించిన 'దూకుడు' చిత్రం 27 షోలతో 5వ స్థానంలోకి, తాజాగా యంగ్ టైగర్ 'దమ్ము' చిత్రం 24 షోలతో 6వ స్థానంలోకి నెట్టబడ్డాయి.
బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ రీమేక్ గా రూపొందిన గబ్బర్ సింగ్ చిత్రం మే 11న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఇప్పటివరకూ అందిన సమచారం ప్రకారం మన స్టేట్ లో 885 పై చిలుకు ధియోటర్స్ లో రిలీజవుతోంది. మిగతా ధియోటర్స్ ఖరారు కావాల్సి ఉంది.
పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.


Click it and Unblock the Notifications











