'గబ్బర్ సింగ్' ప్లస్ లు, మైనస్ లు
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ ఈ రోజు అభిమానులు ఆనందోత్సాహాల మధ్య బారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ప్యాన్స్ కు పండగలా చెప్తున్న ఈ చిత్రంలో పవన్ గబ్బర్ సింగ్ అని పిలిపించుకునే పోలీస్ అధికారిగా కనిపించాడు. కొండవీడు అనే గ్రామంలో జరిగే ఈ కథలో లవ్,యాక్షన్,కామెడీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. వెటకారంతో కూడిన పంచ్ డైలాగులు ఈ సినిమాకు ప్లస్ గా మారాయి. గబ్బర్ సింగ్ కథను చాలా భాగం మార్చిన ఈ చిత్రంలో ప్లస్ లు,మైనస్ లు చూస్తే..
సినిమాకు ప్లస్ లు..
ఇది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. అభిమానుల కోసం ప్ర్తత్యేకంగా తీసిన చిత్రంలా పవన్ నుంచి ఆశించే అన్ని ఎలిమెంట్స్ రంగరించి తీసిన చిత్రం. ముఖ్యంగా ఈ పేటకు నేనే మేస్తిరి పాటతో పవన్ రిక్షాలో వచ్చే ఎపిసోడ్ అదిరిపోయింది. అలాగే సెకండాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ లో అంత్యాక్షరి పూర్తి కామెడీతో హైలెట్ గా నిలిచింది. పవన్,శృతి హాసన్ ల మధ్య వచ్చే లవ్ స్టోరీని నీట్ గా ఫన్ తో ఫీల్ ని మిక్స్ చేసి రన్ చేసాడు దర్శకుడు. అలాగే విలన్ పాత్రను మొదటి నుంచి ఎలివేట్ చేస్తూ దబాంగ్ లో లేని కిక్ ఎలిమెంట్ ని తెలుగు ప్రేక్షకులకు ఇచ్చే ప్రయత్నం చేసారు. అలీ,బ్రహ్మానందం కామెడీపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఆ ట్రాక్ కూడా ఒరిజనల్ లేకపోయినా బాగా ఎలివేట్ అయ్యేలా ఎంటర్టైన్మెంట్ తో నడిపాడు. ఫైనల్ గా సినిమాకు ప్రాణమై నిలిచిన ప్లస్ ..కెవ్వు కేక సాంగ్.
మైనస్ లు...
సినిమా సెకండాఫ్ డల్ అయ్యింది. దబాంగ్ ఒరిజనల్ ని సెకండాఫ్ లో మార్చకుండా అవే సీన్స్ వాడి ఉండే బాగుండేది అనిపిస్తుంది. అలాగే దబాంగ్ లో ఇన్నోసెన్స్ తో కూడిన తమ్ముడు క్యారెక్టర్ కథకు కీలకమై నిలుస్తుంది. ఇక్కడ దాని లెంగ్త్ బాగా తగ్గించారు. హ్యాపీడేస్ గాయిత్రి(అప్పు పాత్ర)ను అజయ్ కు లవర్ గా పెట్టి చేసిన సీన్స్ పెద్దగా పండలేదు. తణికెళ్ల భరణి వంటి ఆర్టిస్టుని వాడుకోలేదు. ప్రీ క్లైమాక్స్ ముందు కథలో కిక్ లేకుండా పోయింది. ముఖ్యంగ శృతిహాసన్ కి డబ్బింగ్ సరిగా చెప్పలేదు. పవన్ కళ్యాణ్ వంక పెట్టలేని విధంగా చేసినా ఆయనకి తగ్గట్లుగా విలన్ పాత్రను మలచకపోవటంతో ఆ సీన్స్ అంతగా పండలేదని అంటున్నారు. అయితే ఇవన్నీ కథలో వెతికి చూస్తేనే కనపించే మైనస్ లు. కథనం కొద్దిగా వేగవంతం చేసి ఉంటే ఇవి అస్సలు కనపడేవి కావు.
హైలెట్స్ లో...
సినిమా కెమెరా వర్క్ అదిరిపోయింది. అలాగే దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కెవ్వు కేక పాట మాత్రమే కాక రీ రికార్డింగ్ సైతం చాలా బాగా చేసారు. ఇక హరీష్ శంకర్ ..మిరపకాయలోలాగనే ఈ చిత్రంలోనూ మంచి డైలాగు రైటర్ గా రాణించారు. పవన్ కి ప్రత్యేకంగా రాసిన పంచ్ డైలాగ్స్ చాలా కొత్తగా ఉండి విజిల్స్ వేయించేలా చేసాయి. ఇక కెవ్వు కేక పాటకు మలైకా వేసిన స్టెప్స్..యూత్ ని ఉర్రూతలూగిస్తోంది. పవన్ మ్యాజిక్ పై పూర్తిగా ఆధారపడి చేసిన ఈ చిత్రం పవన్ అబిమానలుకు మాత్రం కెవ్వు కేక అనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











